Jr.యన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

varla ramaiah reacts on ntr

టీడీపీ నేత వర్ల రామయ్య Jr.యన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేతల వ్యవహారంపై చంద్రబాబు సైతం కన్నీరు పెట్టారు. దీనిపై పార్టీలకతితంగా కూడా నేతలు కొందరు స్పందించి చంద్రబాబకు మద్దతు తెలిపారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు గాను వర్ల రామయ్య విజయవాడలో నేడు దీక్ష చెపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు విమర్శలు చేశారని, వీరి విమర్శలపై జూనియర్ యన్టీఆర్ స్పందించిన తీరు సరిగ్గా లేదంటూ అభిప్రాయపడ్డారు. యన్టీఆర్ మేనత్తను ఇష్టమొచ్చినట్లు అంటుంటే ఆయన స్పందించిన తీరులో ఆయన విఫలమయ్యారని వర్ల రామయ్య తెలిపారు.

ఇక సినిమాల కోసం కుటుంబ నైతిక విలువలను వదులుకుంటారా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. దీంతో పాటు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారే అసలైన టీడీపీ సభ్యులని అన్నారు. ఇక పేర్ని నానికి యన్టీఆర్ అంటే చాలా భయమని అలాంటి వారిని అదుపులో పెట్టే శక్తి ఆయనకే ఉందంటూ వర్ల రామయ్య తెలిపారు. నేను చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇవి నా వ్యక్తిగత వ్యాఖ్యలు అని అన్నారు. తాజాగా వర్ల రామయ్య యన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశమవుతున్నాయి. జూనియర్ యన్టీఆర్ పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.