సీనియర్ యన్టీఆర్ ని ఆయన ఫ్యామిలీ అందుకే దూరం పెట్టింది: బుచ్చయ్య చౌదరి

Black and White Jaffar With Gorantla Butchaiah Chowdary - Suman TV

యన్టీఆర్..ఈ పేరు చెప్పగానే తెలుగు జాతి పులకించి పోతుంది. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో నలిగి పోతున్న రోజుల్లో.. యన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఎంతటి ప్రభంజనం సృష్టించారో అందరికీ తెలిసిందే. నిజానికి పొలిటికల్ గా తెలుగు ప్రజలు సీనియర్ యన్టీఆర్ కి ఎప్పుడూ బహ్మ రధం పడుతూనే వచ్చారు. కానీ.., చంద్రబాబు తిరుగుబాటుతో ఆయన కోలుకోలేని దెబ్బ తిన్నారు.

ఆ సమయంలో యన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆయనకి దూరంగా ఉండిపోయారు. పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబుకే తమ మద్దతు తెలియ చేశారు. అయితే.., ఆనాడు జరిగిన నాటకీయ పరిణామాల గురించి టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఇప్పుడు నోరు విప్పారు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ “బ్లాక్ అండ్ వైట్ విత్ జాఫర్” ఇంటర్వ్యూలో భాగంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని సంచలన నిజాలు బయట పెట్టడం విశేషం.

Black and White Jaffar With Gorantla Butchaiah Chowdary - Suman TV“చంద్రబాబు తిరుగుబాటు సమయంలో అప్పటి మీడియా అంతా యన్టీఆర్ కి వ్యతిరేకంగా పని చేసింది. చాలా మంది నాయకులు దానిని నమ్మి అటు వైపు వెళ్లిపోయారు. ఆ సమయంలో పెద్దాయన కుటుంబ సభ్యులు కూడా దురదృష్టవశాత్తు కాస్త ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ.., మాలాంటి కొంత మంది నాయకులం మాత్రం.. యన్టీఆర్ తోనే ఉండిపోయాము. ఆయన మాకు పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. మాకు రాజకీయ భవిష్యత్ ఉన్నా, లేకపోయినా యన్టీఆర్ తోనే నడవడం న్యాయం అనిపించింది. ఆయన చనిపోయాకే మేమంతా మళ్ళీ టీడీపీలోకి వచ్చాము” అని బుచ్చయ్య చౌదరి ఓపెన్ గా మాట్లాడటం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.