నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం లకారం చెరువులో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి కరాటే కల్యాణి ఈ విషయంపై స్పందిస్తూ విగ్రహావిష్కరణ అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు.
ఖమ్మంలో ఏర్పాటు చేయబోయే సినీయర్ ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక అతిధిగా రజనీకాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగుడుతూ.. ప్రశంసల వర్షం కురిపించారు. వెంటనే వైసీపీ మంత్రులు, నాయకులు రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానటుడు.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.
సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీ కాంత్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆయనకు బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.
తారకరత్న అజాత శత్రువు అనడానికి, తనకున్న కమిట్మెంట్ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. శత్రువులు లేనటువంటి వ్యక్తిగా తారకరత్న ఇవాళ అందనంత ఎత్తుకు ఎదిగడమే కాకుండా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడంలో కూడా వారెవ్వా అనిపించారు.
అప్పటి తరం హీరోలు ప్రజలతో మాట్లాడాలంటే పత్రికల్లో రాసిన లేఖల ద్వారానే మాట్లాడేవారు. ఆ పత్రికల్లో తమ అభిమాన హీరోలు రాసిన మాటలను చదువుకుని మురిసిపోయేవారు. మరి ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ స్వహస్తాలతో రాసిన కృతజ్ఞత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ చేతిరాత ఎలా ఉందో చూసేయండి.
తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగోడి గుర్తింపును ప్రపంచ నలుమూలలకు చాటిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన చిత్రంతో నాణాలను విడుదల చేయనుంది. ఎప్పుడు విడుదల చేస్తారంటే?
తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై కొన్నేళ్ల పాటు యువరాణిలా రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళ్లో సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించిన జమున.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక వయోభారం కారణంగా మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆమె సినిమా కెరీర్ […]
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని దుఖఃం మిగిలిందనే చెప్పాలి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు చలపతి రావు(78) ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లి పర్రులో మణియ్య, వీయమ్మ దంపతులకు జన్మించారు. […]