హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ.!!

హైదరాబాద్‏లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అభం, శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్‏కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.  ఈ విషయంలో పవనకళ్యాణ్ జోక్యం చేసుకోవాలని బాధిత కుటుంబాలు ఈమధ్యే వేడుకోవడం వైరల్ అయ్యింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా చిన్నారి కుటుంబాన్ని పరామర్శ చేయడానికి సిద్ధం అయినట్లు బోగట్టా.

If the accused is caught a reward of Rs 10 lakh - Suman TVవినాయక చవితికి ఒక్కరోజు ముందు హైదరాబాద్‏లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై ఆత్యాచారానికి పాల్పడి  హత్య చేసిన నిందితుడు పల్లకొండ రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేప్టట్టారు. నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సైదాబాద్ పోలీసులు ప్రకటించారు. నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి సరిహద్దు జిల్లాల్లో గాలింపు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో  చిన్నారి హత్యాచార ఘటనపై సినీప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, మహేష్ బాబు స్పందిస్తూ.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   న్యాచురల్ స్టార్ నాని కూడా చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించారు.

ఇప్పుడు జనసేనాధిపతి ‘పవన్ కళ్యాణ్’ కూడా పరామర్శకి వస్తే కేసులో శిక్ష తొందరగా పడుతుందనే నమ్మకం గస్తీవాసులకి., సాధారణ ప్రజలకీ ఏర్పడుతుంది.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ హత్యాచారానికి గురైన ఆరేళ్ళ చిన్నారికి న్యాయం జరగాలని కోరుతూ తెలంగాణ జనసేన వీరమహిళ విభాగం నిరసన దీక్ష  చేపట్టడం జరిగింది.  ఎన్నో ప్రాంతాల్లో జన సైనికులు ఇప్పటికే శాంతి ర్యాలీలూ, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేస్తూ న్యాయంకోరుతూ  బాధిత కుటుంబానికి అండగా ఉంటున్న సంగతి తెలిసిందే.