ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఎక్కడలేని ఆసక్తికర వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంత రసాభాస జరిగిందో అందరికి తెలిసిందే.
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. తాను సీఎం అయిన తరువాతనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం చేశారు. ఆ తరువాత ఓ ప్రెస్ మీట్ లో ‘ఇప్పటి వరకు తనను ఎన్ని అవమానాలు చేసిన భరించానని, ఇప్పుడు రాజకీయాలతో అసలు సంబంధం లేని నా భార్యను అవమానించారని చంద్రబాబు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి తెదేపా నుంచి చాలా మంది సీనియర్ నాయకులు వైసీపీ పై విరుచుక పడ్డారు. తెదేపాకు ధీటుగా వైసీపీ నుంచి కొందురు నాయకులు ఘాటునే స్పందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టుకోవడంపై రోజా స్పందించారు. ఆయన ఎంతో మందిని మానసికంగా బాధ పెట్టారని, చాలామంది జీవితాలను రాజకీయంగా సమాధి చేశారని దానికి ఫలితమే ఇది’ అని రోజా అన్నారు. దేవుడు.. చంద్రబాబు నోటి నుంచే అసెంబ్లీకి రాను అని చెప్పించారని, ఇంక జన్మలో బాబు అసెంబ్లీలో అడుగు పెట్టరని రోజా తెలిపారు. చంద్రబాబు ఎందరినో మానసిక క్షోభ పెట్టారని, దానితో పోలిస్తే ఆయన బాధ చాలా తక్కువని, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉందని రోజా కాస్త ఆవేశంగానే స్పందించారు. అయితే.., ఏకంగా చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నా కూడా, అయనపై రోజా తీవ్ర స్థాయిలోనే స్పందించడానికి కారణం ఏమిటి? అసలు వీరిద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు ఏర్పడిందన్న విషయాలను ఇప్పుడు పరీశీలిద్దాం.
రోజా రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీ నుంచే. రోజా 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడు పార్టీలో ఆమెకి రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలి హోదా కూడా లభించింది. కానీ.., పార్టీలో ఉన్న పదేళ్లలో ఆమె ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేదు. 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు తాను గెలిచే అవకాశం ఉన్న నగరి నియోజవర్గం గాలి ముద్దుకృష్ణమ నాయుడికి కేటాయించి, పార్టీ ఓడిపోయే చంద్రగిరిలో తనకు సీటు ఇచ్చి ఓడించారన్నది రోజా ఆరోపణ. గాలి ముద్దు కృష్ణమ నాయుడితో కలిసి చంద్రబాబు తనని ఎమ్మెల్యే కానివ్వలేదని బాధపడ్డారు.
అంతలా పార్టీ కోసం కష్టపడ్డ తనని పార్టీలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా గెలవకుండా ప్రయత్నాలు చేశారు. ఆ తరువాతి కాలంలో రోజా తెదేపాను వద్దలి వైసీపీలో చేరారు. ఇక్కడి నుంచి 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. నా రాజకీయ ఎదుగుదలకు జగన్న చాలా సహాయ సహకారాలు అందించారని ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదని రోజా అన్నారు. తను ఎమ్మెల్యే గా ఉన్నా కూడా టీడీపీ వారు తనను నిత్యం ఎదో విధంగా అవమానించారు ఆరోపించారు. తెదేపా లో అంతలా కష్టపడ్డ తనని మానసింక హింసించారని, ఐరన్ లెగ్ అని అవమానించారని తెలిపారు. చెప్పుకోలేని పదాలతో తనని, తన కుటుంబాన్ని అనేక బాధలకు గురిచేశారని రోజా ఎన్నో సందర్భాల్లో అన్నారు. రోజా స్పందన పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంల తెలియజేయండి.