బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,200.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,130.
1కిలో వెండి 64,800
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 200 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 47 వేల 130 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 100 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 64 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 100 రూపాయలు తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 100 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 500 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,640 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,030 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,030 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,340 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 49,470 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.