స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 210 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 120 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 50,070.
1కిలో వెండి 71,000
బిజినెస్ డెస్క్– ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 21 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 12 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 210 రూపాయలు తగ్గి 45 వేల 900 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 120 రూపాయలు తగ్గి 50 వేల 070 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 700 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 71 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 800 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 870 రూపాయలు పెరిగింది.