తన యూజర్లకు 683 కోట్ల రూపాయలను చెల్లించనున్న టిక్ టాక్

ఇంటర్నేషనల్ డెస్క్- టిక్ టాక్.. ఈ సోషల్ మీడియా యాప్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. చైనా కు చెందిన ఈ యాప్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. టిక్ టాక్ వీడియోల ద్వార చాలా మంది సెలబ్రెటీలు అయ్యారు. ఐతే చైనాకు చెందిన ఈ యాప్ ను కొన్ని అనివార్య కారణాల వల్ల మన దేశంలో బ్యాన్ చేశారు. దీంతో భారత్ లో టిక్ టాక్ యాప్ అందుబాటులో లేదు.

ఇక ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ యాప్ ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. అందులో అగ్ర రాజ్యం అమెరికా కూడా ఒకటి. అమెరికా యూజర్ల నుంచి వ్యక్తి గత డేటాను వారి అనుమతి లేకుండా టిక్‌ టాక్‌ సేకరించిందని క్లాస్ యాక్షన్ కోర్టులో దావా దాఖలు చేసింది. ఇప్పుడు ఈ దావా నిరూపితమయ్యాయి. అంతే కాకుండా బయోమెట్రిక్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రైవసీ చట్టాన్ని టిక్‌ టాక్‌ పూర్తిగా ఉల్లంఘించిందని తెలుస్తోంది. ​

business tiktok 1

క్లాస్‌ యాక్షన్‌ వేసిన దావాపై టిక్‌ టాక్‌ ఖండిస్తూనే, అమెరికాలోని యూజర్లకు 92 మిలియన్‌ డాలర్లను చెల్లించడానికి అంగీకరించింది. టిక్‌ టాక్‌ అమెరికన్‌ యూజర్లకు సుమారు 683 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 వరకు టిక్‌ టాక్‌ లో నమోదైన యూజర్లకు ఈ మొత్తాన్ని చెల్లించనుంది. క్లాస్‌ యాక్షన్‌ సెటిల్‌ మెంట్‌ లో భాగంగా టిక్‌ టాక్‌ యూజర్లకు 683 కోట్లను పొందడానికి అర్హులు.

అందులో భాగంగా టిక్‌ టాక్‌ ఇప్పటికే అర్హత కల్గిన 89 మిలియన్ల అమెరికన్‌ యూజర్లకు నోటిఫికేషన్‌ రూపంలో మెసేజ్‌ను పంపించింది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి క్లెయిమ్‌ చేస్తే, సుమారు 0.89 డాలర్ల నుంచి 5 డాలర్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అర్హత కల్గిన టిక్‌ టాక్‌ యూజర్లు తమ మాస్టర్‌ కార్డ్‌ ,పే పాల్‌, వెన్మో ద్వారా చెల్లింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చునని టిక్‌ టాక్‌ స్పష్టం చేసింది.