వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలు

బిజినెస్ డెస్క్- గురువారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఉదయం ఊగిసలాట ధోరణిలో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం 49,971 వద్ద ట్రేడంగ్ ను ప్రారంభించిన సెన్సెక్స్ 337 పాయింట్లు కోల్పోయి 49,564 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 15,042 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టి చివరకు 124 పాయింట్లు కోల్పోయి 14,906 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. అమెరికాలో డోజోన్స్‌ సూచీ ప్రీమార్కెట్లో 200 పాయింట్లు పతనమైంది. ఇక నాస్‌ డాక్‌ సూచీలు మెటల్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో విక్రయాలు జరిగాయి.

Stock market

ఎఫ్ అండ్ వో కాంట్రాక్టుల్లో కూడా అమ్మకాలు బాగా జరిగడంతో పాటు, ఎఫ్‌పీఐల విక్రయాలు దీనికి జత కలిశాయి. బీఎస్‌ఈ రియాల్టీ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా.. లోహ రంగ సూచీ అత్యధిక నష్టాల్లో ఉంది. సిప్లా, బీపీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహింద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాలను ఆర్జించాయి. హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, బ్రిటానియా షెర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. దేశంలో కరోనా కేసుల ప్రభావం షేర్ మార్కెట్లపై పడుతోంది. శుక్రవారం ట్రేడింగ్ కాస్త ఆశాజనకంగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.