'4 గంటల్లో రూ.482 కోట్లు సంపాదన.. ' ఈ మొత్తం చూశాక ఇంత డబ్బా.. అని ఆశ్చర్యపోవడం సహజం. కానీ, ఇది వాస్తవం. అలా అని అడ్డదారిలో ఏ బెట్టింగ్ వల్లో.. ఏ ఇల్లీగల్ వ్యవహారాల వల్లో సంపాదించారేమో అనుకోకండి. తన తెలివితేటలతో, తన వ్యాపార చిట్కాలతోనే ఆమె ఇంత మొత్తం సంపాదించారు.
స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారికి బిగ్బుల్ ‘రాకేష్ ఝున్‌ఝున్‌వాలా‘ గురుంచి ప్రత్యేక పరిచాయలక్కర్లేదు. కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారు. ట్రేడర్‌గా, చార్టెడ్ అకౌంటెంట్‌గా ఎంతో పేరుగడించిన ఆయన.. తన వ్యాపార చిట్కాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. ఆయన గతేడాది గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వలే ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా కూడా స్టాక్ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. నిన్నటికి నిన్న కేవలం నాలుగు గంటల్లో రూ.482 కోట్లు సంపాదించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. భర్త మరణాంతరం ఆయన పెట్టుబడులకు సంబంధించిన షేర్లన్నీ రేఖ పేరిట బదిలీ అయ్యాయి. అందులో స్టార్ హెల్త్ పెట్టుబడులు కూడా ఒకటి. దీని షేర్ వాల్యూ ఒక్కసారిగా 52 వారాల కనిష్ట స్థాయి(రూ.469) నుంచి రూ.556.95కి ఎగిసింది. దీంతో ఆమె సోమవారం (ఫిబ్రవరి 20) ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే దాదాపు రూ. 482 కోట్లు ఆర్జించారు.
ఆమెకు స్టార్ హెల్త్ లో మొత్తం 10,07,53,935 షేర్లు ఉండగా, ఒక్కో షేరుకు రూ.47.90 పెరగడంతో రూ.482 కోట్లు ఆర్జించారు. ఇక టాటా కంపెనీల పెట్టుబడులు ద్వారా ఆమె ఈ మధ్యనే రెండు వారాల్లో రూ.1000 కోట్లు సంపాదించారు. ప్రస్తుతానికి రేఖా ఝున్‌జున్‌వాలా నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా అంచనా. ఈ వార్త ఆమె విజయం గురుంచి తెలియచెప్పాడానికి మాత్రమే. చదివాక మేము స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతాం అని మాత్రం ఆలోచించకండి. అందులోని ప్రతి విషయంపై క్షుణ్ణంగా అవగాహన ఉన్నవారికే అది సాధ్యం. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Meet #RekhaJhunjhunwala who earned Rs 1000 crore in 2 weeks due to #RatanTata co, her net worth is…https://t.co/ZssZAwPO7H
— DNA (@dna) February 17, 2023