వరుసగా రెండవ సారి ట్రోపీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ కలలను కల్లలు చేసింది చెన్సై సూపర్ కింగ్స్. ధోనీ సారధ్యంలోని సీఎస్కే ఐదవసారి ఐపిఎల్ చాంపియన్ అయ్యింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 16 సీజన్లు జరగ్గా.. సీఎస్కే మాత్రమే 10 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. 171 పరుగులుగా లక్ష్యాన్ని..రుతురాజ్, రహానే, అంబటి రాయుడు, జడేజా సమష్టిగా బ్యాటింగ్ చేసి.. తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అయితే మ్యాచ్ ఫైనల్స్ జరగకుండానే...
ఐపీఎల్-16 ఫీవర్ నేటితో ముగిసిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ పోరులో తలపడ్డాయి గుజరాత్ టైటాన్స్, చెన్సై సూపర్ కింగ్స్. అందరి హాట్ ఫేవరేట్ అయిన సీఎస్కే కప్పును ఎగురేసుకుపోయింది. వరుసగా రెండవ సారి ట్రోపీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ కలలను కల్లలు చేసింది సీఎస్కే. ధోనీ సారధ్యంలోని సీఎస్కే ఐదవసారి ఐపిఎల్ చాంపియన్ అయ్యింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 16 సీజన్లు జరగ్గా.. సీఎస్కే మాత్రమే 10 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. చివరి మ్యాచులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 214 పరుగులు చేసి భారీ టార్గెట్‌ను ప్రత్యర్థి ముందుంచుంది. అయితే వర్షం రావడంతో కాస్త మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించి.. 171 పరుగులుగా లక్ష్యాన్ని ఫిక్స్ చేశారు. రుతురాజ్, రహానే, అంబటి రాయుడు, జడేజా సమష్టిగా బ్యాటింగ్ చేసి.. తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఉత్కంఠగా సాగిన పోరులో ఐదవ సారి సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో ట్రోపీని ముద్దాడింది.
కాగా, గెలిచిన జట్టు సీఎస్కేకు రూ. 20 కోట్లు ఫ్రైజ్ మనీ లభించింది. విజయాన్ని పక్కన పెడితే.. ఈ సీజన్ మొత్తంలో చెన్సై సూపర్ కింగ్స్ యాజమాన్యం మాత్రం భారీ లాభాలను ఆర్జించింది. మ్యాచ్ ముగియకుండానే, కప్పు గెలవడానికి కన్నా ముందే.. రూ. 166 కోట్లను సంపాదించింది ఈ యాజమాన్యం. అదెలా అంటే.. చెన్సై సూపర్ కింగ్స్ యజమాని ఎవరంటే ప్రముఖ వ్యాపార వేత్త ఎన్. శ్రీనివాసన్. దేశంలో అతిపెద్ద సిమెంట్ సంస్థల్లో ఒకటైన ఇండియా సిమెంట్స్ అధినేత ఆయన. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మాజీ చైర్మన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కూడా. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేశాడు. అయితే ఆయన చుట్టూ కూడా బెట్టింగ్, స్కామ్ వంటి ఇతర వివాదాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ నేరం నిరూపితం కాలేదు. అయితే సీఎస్కే ఈ సీజన్‌లో తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్‌పై గెలిచిన సూపర్ కింగ్స్ ఫైనల్స్ కు చేరుకుంది. తుది మ్యాచ్ ఆ జట్టుతోనే 28న మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది.
సీఎస్కే జట్టు ఎప్పుడైతే ఫైనల్‌కు చేరుకుందో.. ఆ సంస్థ యాజమాన్యానికి సంబంధించిన సంస్థ ఇండియా సిమెంట్ షేరు ఒక్కసారిగా పెరిగింది. సోమవారం సాయంత్రం మ్యాచ్ జరుగుతుండగా.. పొద్దున్నే ఆ సంస్థ షేర్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. దాదాపు షేరు 3 శాతం పెరగింది. ఆ తర్వాత కంపెనీ షేరు వాల్యూ రూ.193.20 వద్ద ముగిసింది. కాగా, ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేరు కూడా రూ.193.50కి చేరింది. సిమెంట్ స్టాక్‌లో బూమ్ కనిపించడం ఇది వరుసగా రెండో రోజు. కాగా, శుక్రవారం కంపెనీ షేరు రూ.187.85 వద్ద ముగిసింది. ఇండియా సిమెంట్ 52 వారాల గరిష్ట స్థాయిని చూసిన వాల్యూ రూ. 298. 45గా ఉంది. ఇక కంపెనీ సిమెంట్స్ షేర్స్ పెరగడంతో కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసిన సమయానికి కంపెనీ మార్కెట్ విలువ రూ 5,821.41 కోట్లు ఉండగా.. సోమవారం ముగింపు సమయానికి రూ. 5,98721 కోట్లు పెరిగింది. అంటే కొన్ని గంటల్లోనే కంపెనీ.. రూ. 166 కోట్ల లాభాలను గడించింది.