స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే ఆచితూచి అడుగులు వేయాలి. ఇందులో సూచీలు కంపెనీ లాభ, నష్టాలను డిసైడ్ చేయగలవు. స్టాక్ మార్కెట్‌లో షేర్ల పతనం కారణంగా పెద్ద సంస్థలు కూడా గల్లంతైన సంగతి విదితమే. అయితే ఈ స్టాక్ మార్కెట్ మాత్రం ఆ కుటుంబానికి వరంగా మారింది.
బడా బడా కంపెనీల లాభ, నష్టాలను డిసైడ్ చేసేవి స్టాక్ మార్కెట్లే. స్టాక్ మార్కెట్ కంపెనీ షేర్లు పెరిగితే.. కంపెనీలు లాభాల బాట పడతాయి. షేర్లు పతనమైతే కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతాయి. స్టాక్ మార్కెట్‌లో షేర్ల పతనం కారణంగా పెద్ద సంస్థలు కూడా గల్లంతైన సంగతి విదితమే. అయితే ఈ స్టాక్ మార్కెట్ మాత్రం ఆ కుటుంబానికి వరంగా మారింది. భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాపార వేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. ఈ పేరు తెలియని బడా వాణిజ్య సంస్థలు లేవు. స్టాక్ మార్కెట్‌కే చుక్కలు చూపించారు. ఇండియన్ వారెన్ బఫెట్ అన్న పేరు ఉంది. అయితే ఆయన చనిపోయినా ఆ హవాను కొనసాగిస్తున్నారు ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా.
సోమవారం స్టాక్ మార్కెట్ చూసే ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో సూచీలు ఎలా పరుగెడతాయో అనే ఆలోచన ఉంటుంది. కానీ రేఖాకు మాత్రం ఈ ఉదయం శుభోదయంగా మారింది. కేవలం 15 నిమిషాల్లో రేఖా నికర విలువ రూ. 400 కోట్లు పెరిగింది. తన పోర్ట్‌ఫోలియోలోని టాటాగ్రూపునకు చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్లు ఒక్కసారిగా లాభాలను సూచించాయి. దీంతో ఆమె మరింత ధనవంతురాలిగా మారిపోయారు. బిఎస్‌ఇ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ షేర్లలో టాటా మోటార్స్ కూడా అత్యధికంగా లాభపడింది. దీంతో సోమవారం నాటి మార్కెట్‌లో టైటన్, టాటా మోటార్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి.
ట్రేడింగ్ ఆరంభం 15 నిమిషాల్లోనే, టైటన్ ధర ఒక్కొక్కటి రూ. 2,598.70 గరిష్ట స్థాయికి చేరింది. అలానే టైటన్ మోటారు షేరు ధర ఒక్కొటి రూ. 470.40కి చేరింది. మునుపటి ముగింపుతో పోలిస్తే రూ. 50కు పైనే ఎగిసింది. అదేవిధంగా, టాటా మోటార్స్ షేరు ధర రూ. 32.75 పెరిగింది.
2022 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, రేఖాకు 4,58,95,970 టైటాన్ షేర్ల ఉన్నాయి. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన మూలధనంలో 5.17 శాతం. కాబట్టి, సోమవారం సెషన్‌లో మొదటి 15 నిమిషాల్లో టైటాన్ షేరు ధర పెరిగిన తర్వాత రేఖా నికర విలువ దాదాపు రూ.230 కోట్లు (రూ50.25 x 4,58,95,970) పెరిగింది. అలాగే టాటా మోటార్స్ షేర్లు 5,22,56,000 షేర్లు లేదా కంపెనీలో 1.57 శాతం వాటా. కాబట్టి, రేఖా నికర విలువలో మొత్తం పెరుగుదల దాదాపు రూ.170 కోట్లు (రూ.32.75 x 5,22,56,000).