వెండి ప్రియులకు శుభవార్త, హైదరాబాద్ లో ఈ రోజు భారీగా తగ్గిన వెండి ధర

భారీగా తగ్గిన వెండి ధర
బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,550.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,600.
1కిలో వెండి 65,300

బిజినెస్ డెస్క్-  ఈ రోజు శుక్రవారం బంగారం ధరలో మార్పు లేదు. గురువరాతంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 550 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 48 వేల 600 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా 4,900 రూపాయలు తగ్గింది. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 65 వేల 300 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 400 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 440 రూపాయలు పెరిగింది.

silver 2 2

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 840 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,920 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,460 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,460 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,950 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.