ఆయనతో చాలా సమయం గడిపా.. ఎంతసేపైనా బోర్ కొట్టదు

ఫిల్మ్ డెస్క్- ‘టక్ జగదీష్’.. నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న టక్ జగదీశ్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

టక్ జగదీష్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ముద్దు గుమ్మ రీతూ వర్మ నాని గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో టక్ జగదీష్ ప్రత్యేకమైందని రూతూ వర్మ చెప్పింది. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రధన్యతతో కూడుకున్నదని తెలిపింది. గుమ్మడి వరలక్ష్మీగా ప్రభుత్వ అధికారిగా తన అధికారాన్ని చూపించే పాత్రలో నచింటానని చెప్పింది. టక్ జగదీష్ థియేటర్‌లో రిలీజ్ కావాల్సిన సినిమానే అయినా, కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాతలు ఆమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారని రీతూ వర్మ చెప్పుకొచ్చింది.

Nani and Ritu Varma 2

ఓటీటీలో ఈ సినిమా విడుదల అవుతుండటం వల్ల ఒకేసారి చాలా మంది చూసే అవకాశం ఉంటుందని అంది. ఇక ఈ క్రమంలో హీరో నాని గురించి చాలా విషయాలు చెప్పింది రీతూ వర్మ. అంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలిసి నటించానని గుర్తు చేసింది. ఐతే ఈ సినిమాలో తనది తక్కువ నిడివి ఉన్న పాత్ర కావడం, పైగా తాను అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి రావడం వల్ల నానితో అంతగా ఇంటరాక్షన్ కాలేదని చెప్పింది.

ఈ సారి మాత్రం అలా కాదని, హీరో నానితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది రీతూ వర్మ. ఇక నాని నుంచి ఎంతో నేర్చుకున్నానని, సినిమా, జీవితం వంటి వాటి మీద నానికి ఎక్కువ నాలెడ్జ్ ఉందని కితాబిచ్చింది. నాని మాట్లాడితే అలా ఎంతసేపైనా వినాలనిపిస్తూనే ఉంటుందని పొగడ్తలలో ముంచెత్తింది. టక్ జగదీష్ సినిమా కోసం నాని తనకు చాలా సపోర్ట్ చేశారని అంది రీతీ వర్మ. అదన్న మాట సంగతి.