ఢిల్లీలో పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రితో భేటీ, వెంట రఘురామ

న్యూ ఢిల్లీ- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో సర్వత్రా రేపుతోంది. పవన్ కు హఠాత్తుగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు.

ఢిల్లీకి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యామ్ సమావేశం అయ్యారు. ఐతే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో పవన్ భేటి హాట్ టాపిక్ గా మారింది. ఇంత హఠాత్తుగా కేంద్ర మంత్రితో పవన్ భేటీకి గల కారణాలపై జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Pawan Kalyan 1

ఇంకా ఢిల్లీలోనే ఉన్న పవన్ కళ్యాణ్.. అపాయింట్ మెంట్ దొరికితే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశం అవుతారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇటవంటి సమయంలో జనసేనానిని ఢిల్లీ పిలిపించడానికి గల కారణంపై ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. మొన్న జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో పవన్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా, అలా ఏం జరగలేదు.

ఐతే పవన్ కళ్యాణ్ కు రాజ్య సభ పదవి ఇస్తారన్న ఉహాగానాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీకి పిలిచారని జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఆయన వెంట వైసీపీ భహిస్కృత ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉండటం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.