షోరూం మొదటి అంతస్తు నుంచి గాల్లోకి ఎగిరిన కారు!..

ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అలకాపురి సిగ్నల్ వద్ద టాటా మోటార్స్ షోరూంలో ప్రమాదం చోటు చేసుకుంది. కస్టమర్ కారు ట్రయల్ చేస్తుండగా అది ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. షోరూం యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Accident at Lb Nagar 01 minకారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి అంతస్తు నుండి హైడ్రాలిక్ సిస్టం పై దూసుకు వచ్చిన కారు పార్కింగ్ లో ఉన్న కారుతో పాటు బైకుపై పల్టీ కొట్టింది. ఈ కారు నడుపుతున్న భగవత్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. షోరూమ్ యాజమన్యం నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అల్కాపురి చౌరస్తాలో టాటా కార్ల షోరూం భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదన్నారు. షోరూం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓపెన్‌ లిఫ్టుకు కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ఓపెన్‌ లిఫ్టు నిర్వహస్తున్న టాటా మోటార్స్ కార్ల షోరూంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు భగవత్‌కు సరిగా డ్రైవింగ్‌ రాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని షోరూం సిబ్బంది చెప్తున్నారు. అనుకోని ఘటనతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఈ సమాచారంపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.