కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరించిన, అంతకు ముందు కేరళ మంత్రిగానూ పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కె.శంకరనారాయణన్ (89) పాలక్కాడ్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతోన్న ఆయన కేరళలోని పాలక్కాడ్‌లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కె.శంకరనారాయణన్.. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.
ఇది చదవండి: బాబాయ్‌తో మల్టీస్టారర్ సినిమా గురించి అబ్బాయ్ ఏమన్నాడంటే..
ఇక కేరళ శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆర్థిక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు. శంకరనారాయణన్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా రాజకీయ రంగాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. శంకరనారాయణన్ మృతి పట్ల కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేష్ సంతాపం తెలుపుతూ.. రాష్ట్రం సీనియర్, ప్రముఖ రాజకీయ నేతను కోల్పోయిందని అన్నారు. 16 ఏళ్ల పాటు యూడీఎఫ్ని నడిపించారు. తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూడా శంకరనారాయణన్ అన్నింటిని సులభంగా, ఆదర్శప్రాయంగా ఎదుర్కొన్నారు. శంకరనారాయణ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.