భారత్‌కు రానున్నవ్యాక్సిన్ – స్పుత్నిక్ వి

కరోనా పై పోరాటంలో చివరి అస్త్రంగా భావిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో అందరికీ అందించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మెల్లగా ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్న కోవాక్సిన్, కోవీ షీల్డ్ టీకాలకు తోడుగా రష్యా నుంచి స్ఫుత్నిక్ వి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ ‘స్పుత్నిక్‌’ ను ప్రయోగించింది. అందుకు గుర్తుగా రష్యన్‌ గవర్నమెంట్‌ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కు స‍్పుత్నిక్‌ – వి అని నామకరణం చేసింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన ఎబోలా, మెర్స్‌ వైరస్‌ లను అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేసిన రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.  

download 1 2

స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ 1,50,000 డోసుల తొలి కన్‌సైన్‌మెంట్‌తో ఓ విమానం శనివారం ఉదయం రష్యా నుంచి బయల్దేరినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు అప్పగిస్తారు. ఈ డోసులను ప్రజలకు వ్యాక్సినేషన్ కోసం అప్పగించడానికి ముందు సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ నుంచి అనుమతి తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది.

images 9

అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, దాదాపు 5 మిలియన్ల స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ బాటిల్స్ జూన్‌లో రష్యా నుంచి మన దేశానికి వస్తాయి. మరో 10 మిలియన్ల బాటిల్స్ జూలైలో వస్తాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here