ట్రైన్ నడుపుతూ ఆమె సెల్‌ఫోన్ వాడుతూ ఉంది. ముందు రైలు పట్టాలపై ఏం జరుగుతోందో ఆమె గమనించనలేదు. ఈ నేపథ్యంలోనే ఓ ఆగి ఉన్న ట్రైన్‌ను ఆమె నడుపుతున్న ట్రైన్ ఢీకొట్టింది.
ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మనుషులు తమ పక్కన ఉన్నవారితో గడిపే సమయం కంటే సెల్‌ఫోన్‌లో గడిపే సమయం ఎక్కువగా ఉంటోంది. పని సమయాల్లో కూడా కొంతమంది సెల్‌ఫోన్ వాడుతున్నారు. తాజాగా, ఓ మహిళా లోకో పైలట్ ట్రైన్ నడుపుతూ సెల్‌ఫోన్ వాడసాగింది. ఆమె చేసిన తప్పు కారణంగా ఆమె నడిపే ట్రైన్ మరో ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన రష్యాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని ఓ ప్రముఖ నగరంలో ఓ ట్రైన్ పట్టాలపై వెళుతూ ఉంది.
ఆ ట్రైన్‌ను ఓ మహిళా లోకో పైలట్ నడుపుతూ ఉంది. ఆ మహిళా లోకో పైలెట్ నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్ వాడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందు ఏం జరుగుతోందో ఆమెకు తెలియలేదు. కొద్ది సేపటి తర్వాత అదే పట్టాలపై ఇంకో ట్రైన్ ఆగి ఉంది. ఆగి ఉన్న ట్రైన్ గురించి ఆమె పట్టించుకోలేదు. దీంతో ఆగిఉన్న ట్రైన్‌ను ఈ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో మహిళా లోకో పైలట్ నడుపుతున్న ట్రైన్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. అయితే, ఆమెకు మాత్రం ఏమీ కాలేదు.
చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికులు యాక్సిడెంట్ దెబ్బకు భయపడిపోయారు. అయితే, వారిలో కూడా ఎవ్వరికీ గాయాలు కాలేదు. రెండు ట్రైన్లు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2019లో జరిగిన ఈ సంఘటన తాలూకా వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోను ట్విటర్‌లో ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా మంది చూశారు. మరి, సెల్‌ఫోన్ వాడుతూ ప్రమాదానికి కారణమైన మహిళా లోకో పైలట్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
driving a train while on a smartphone pic.twitter.com/CZA23skxdv
— CCTV IDIOTS (@cctvidiots) April 20, 2023