నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ వాహనం తప్పనిసరి అయిపోయిందనే చెప్పాలి.. ప్రయాణాలు సులభతరం కావాలని ప్రతి ఒక్కరూ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మద్య వాహనాల ధరలు పెరిగిపోవడం.. దానికి తోడు పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో కొంతమంది సైకిల్ కొనేందుకు ఇష్టపడుతున్నారు.
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం అనేది కామన్ అయ్యింది. ఈ మద్య ద్విచక్ర వాహనాల రేట్లు భారీగా పెరిగిపోయాయి.. దానితో పాటు పెట్రోల్ ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. ఈ కారణంతో కొంతమంది సైకిల్ వైపు మొగ్గుచూపుతున్నారు. సైకిల్ మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనం. దీని వల్ల ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. పొల్యూషన్ కొంత వరకు తగ్గించుకోవచ్చు. అందుకే ఈ మద్య చాలా మంది సైకిల్ కొనేందుకు ఇష్టపడుతున్నారు. సాధారణంగా సైకిల్ చక్రాలు గుండ్రంగా ఉంటాయి. చక్రాలకు అటాచ్ చేస్తూ ఫ్రేమ్, చైన్, బ్రేకులతో ఒక సైకిల్ రూపొందుతుంది. కానీ ఓ చోట గుండ్రంగా కాకుడా చతురస్రాకారంలో (బాక్స్ షేప్) టైర్లు ఉన్న సైకిల్ రోడ్లపై చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా సైకిల్ చక్రాలు గుండ్రంగా ఉంటాయి.. ఒక్క సైకిల్ ఏంటీ.. బైక్, కారు, చివరికి ఆకాశంలో వెళ్లే విమానం కూడా ల్యాండింగ్ సమయంలో మూడు చక్రాలు ఉంటాయి.. అవి గుండ్రంగానే ఉంటాయి. అంతెందుకు రవాణా వ్యవస్థకు సంబంధించిన ఏ చక్రమైనా గుండ్రంగా ఉంటుంది. వివిధ రకాల వాహనాలకు వాడే టైర్లు చిన్నగా పెద్దగా డిఫరెన్స్ గా ఆకారంలో ఉండొచ్చు కానీ.. ఏదైనా గుండ్రంగానే ఉంటాయి. కానీ ఈ మద్య కొంతమంది థింక్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు.. సైకిల్ కి గుండ్రటి చక్రాలు కాకుండా చతురస్రాకారంలో టైర్లు ఉంటే ఎలా ఉంటుందని భావించాడు. అంతే దాన్ని అమల్లో పెట్టేశాడు.
రష్యాకు చెందిన ‘దీ క్యూ ’ సంస్థకు చెందిన ఇంజనీర్ సెర్గీ గోర్డీవ్. సైకిల్ చక్రాలను గుండ్రటి ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో తయారు చేశారు. యుద్ద ట్యాంకుల చక్రాల్లో వాడే ‘స్క్వేర్ టైర్ ’ టెక్నాలజీ తో చతురస్త్రాకార చక్రాలకు ఉపయోగించాడు సెర్గీ గోర్డీవ్. సైకిల్ కదులుతున్నపుడు వాటి అంచులకు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బెల్ట్ మాత్రమే కదులుతుంది. అదే విధంగా స్క్వేర్ వీల్ సైకిల్ లో చతురస్త్రాకారపు వీల్స్ కదలకుండా అలాగే ఉంటాయి. పెడల్స్ తొక్కినపుడు ఆ బెల్డ్ కదిలేలా గేర్లను, చైన్ లను ఏర్పాటు చేశాడు. పెడల్ ను తొక్కినపుడు బెల్ట్ కదులుతూ సైకిల్ ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి వినూత్నమైన ఎవరూ ఆలోచించలేదని.. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోడ్డుపై చూడటానికి ఈ సైకిల్ భలే విచిత్రంగా కనిపిస్తుంది. అయితే అంతా బాగానే ఉంది.. మరి కొన్ని రోడ్లు ఈ సైకిల్ చక్రాలకు అనుకూలంగా ఉంటాయా? గుంటలు, స్పీడ్ బ్రేకర్లు వస్తే పరిస్థితి ఏంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
How The Q created a bike with fully working square wheels (capable of making turns)
[full video: https://t.co/wWdmmzRQY3]pic.twitter.com/bTIWpYvbG1
— Massimo (@Rainmaker1973) April 11, 2023