జయలలిత వేదనిలయంపై తీర్పు వెల్లడించిన మద్రాస్ హైకోర్టు

తమిళనాడులో అమ్మ అనగానే అందరికి గుర్తుకు వచ్చేదే జయలలిత. ఆమె రాజకీయ పోరాటం ఎంతో మంది మహిళలకు ఆదర్శం. తమిళనాడులో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. రెండో పర్యాయం సీఎం గా ఉన్న జయలలిత ఆనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకుపైగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. అనంతరం అన్నాడీఎంకేలో చీలికలు, వివాదాలు మొదలయ్యాయి. అలాంటి వివాదంలో ఉన్న జయలలిత నివాసం వేదనిలయంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

image 0 compressed 9తమిళనాడు రాజకీయంలో జయలలితది ప్రత్యేకమైన స్థానం. ఎన్నో ఆటుపోటులు, అవమానాలు ఎదుర్కొని తమినాడులో సీఎంగా ఎక్కువ సార్లు పనిచేసిన మహిళగా గుర్తింపు పొందారు. కరుణానిధి లాంటి రాజకీయ ఉద్ధండుడిపై పోరాడి గెలిచింది. తమిళ ప్రజలకు అమ్మ క్యాంటీన్లు పెట్టి వారికి నిజంగానే అమ్మగా మారింది. ఎవరిని వరుసగా రెండు పర్యాయాలు గెలిపించే ఆనవాయితీ తమిళ ప్రజలకు లేదు. కానీ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి వరుసగా రెండో సారి జయలలితకు అధికార పగ్గాలు అప్పగించారు తమిళ ప్రజలు. రెండో సారి ముఖ్యమంత్రిగా స్థానంలో ఉండాగా 2016 డిసెంబర్ 5 చెన్నై అపోలో ఆస్పత్రిలో మరణించారు. జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే లో విభేదాలు చోటుచేసుకున్నాయి. జయలలిత స్నేహితురాలు నెచ్చెలి శశికళ, మేనల్లుడు దినకరణ్ లు ఒక వర్గంగా , పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఒక వర్గంగా ఏర్పడ్డారు. అక్రమ ఆస్తుల కూడగట్టిందని శశికళ జైలు శిక్ష పడింది. ఆసమయంలో దినకరణ్ ఆమె తరపున రాజకీయాలు సాగించాడు. జయలలితకు సంబంధించిన కొన్ని ఆస్తుల విషయంలో ఈ ఇరువర్గాల మధ్య వివాదలు కోర్టు పరిధిలోకి వెళ్లాయి.

image 1 compressed 8చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ లో గల జయలలిత నివాసాన్ని ‘వేద నిలయం’ అని పిలుస్తారు. గతంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ వేద నిలయాన్ని అమ్మ సార్మక కేంద్రం మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వేదనిలయం జయలలిత వారసులుగా మాకే చెందాలంటూ… ఆమె మేనల్లుడు జే దీపక్, మేన కోడలు జే దీపలు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ స్వీకరించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పును వెల్లడించింది. జయలలిత నివాసం వేదనిలయం భవంతి ముమ్మాటికీ ఆమె వారసులకే చెందుతుందన్ని జస్టిస్‌ ఎన్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. అమ్మ మరణం తర్వాత వర్గ విభేదాలు తలెత్తి చివరికి బీజేపీ పంచన చేరిన అన్నాడీఎంకే అసలే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోగా, ఇప్పుడు వేదనిలయం కూడా చేజారడం షాకింగ్ పరిణామంగా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.