ఒకప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ల మాత్రమే గుర్తుండేవి. ఇక సైడ్ క్యారెక్టర్లకు వారు చేసిన పేర్లతో పిలిచే వారు. అటువంటి వారిలో బ్రహ్మనందం, బాబుమోహన్, జయలలిత వంటి వారున్నారు. బ్రహ్మనందం పేరు ఇప్పుడంటే అందరికీ తెలుసు గానీ, ఒకప్పుడు ఆయన్ను అరగుండు బ్రహ్మనందం (ఆహా నా పెళ్లంటలో క్యారెక్టర్ పేరు అరగుండు వెధవ), బాబు మోహన్ ను పాయ అని పిలిచేవారు. అలాగే అప్పట్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయాలంటే గుర్తుకు వచ్చే నటి జయలలిత.
సినిమాల్లో కొన్నిసార్లు హీరో హీరోయిన్ క్యారెక్టర్లే కాదూ..విలన్, కామెడీ, వ్యాంప్ వంటి సైడ్ క్యారెక్టర్లు అలరిస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ఇంటర్నెట్ సదుపాయం వచ్చాక హీరో హీరోయిన్లే కాదూ..పలువురి పేర్లను గూగుల్ చేస్తే వికిపీడియా రూపంలో వారి వివరాలు, వారూ చేసిన సినిమా వివరాలు వచ్చేస్తుంటాయి. అయితే గతంలో అటువంటి అవకాశం లేక.. కేవలం హీరో హీరోయిన్ల పేర్లు ఉండేవి. ఇక సైడ్ క్యారెక్టర్లకు వారు చేసిన పేర్లతో పిలిచే వారు. అటువంటి వారిలో బ్రహ్మనందం, బాబుమోహన్, జయలలిత వంటి వారున్నారు. బ్రహ్మనందం పేరు ఇప్పుడంటే అందరికీ తెలుసు గానీ, ఒకప్పుడు ఆయన్ను అరగుండు బ్రహ్మనందం (ఆహా నా పెళ్లంటలో క్యారెక్టర్ పేరు అరగుండు వెధవ), బాబు మోహన్‌ను పాయ అని పిలిచేవారు. అలాగే అప్పట్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయాలంటే గుర్తుకు వచ్చే నటి జయలలిత. ఆమె పేరు తెలియక చాలా మంది బోరింగ్ పాప అని పిలిచే వారు. బాలకృష్ణ, విజయ శాంతి హారో హీరోయిన్లుగా నటించిన లారీ డ్రైవర్ లో ఆమె పేరు బోరింగ్ పాప. దీంతో ఆమె పేరు అలా ముద్ర పడింది. ఆ తర్వాత ఆమె పేరు జయలలిత తెలిసింది. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఎన్నో సినిమాల్లో నటించిన, ఆ తర్వాత సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో సుమారు 650లకు పైగా చిత్రాల్లో నటించారు. అయితే ఆమె వివాహ జీవితం మూడు నెలల ముచ్చటగా మారిపోయింది. దీనిపై మాట్లాడుతూ ‘బాగా సినిమాలతో బిజీగా గడుపుతూ.. నా ఫ్యామిలీని సెటిల్ చేశాను అనుకున్న సమయంలో ప్రేమలో పడ్డాను. మలయాళ దర్శకుడు వినోద్, నేను ఏడేళ్లుగా ప్రేమించుకున్నాం. మలయాళంలో ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. అయితే అతడిని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్న సమయంలో.. ఇక్కడ మన వాళ్లకు పరిచయం చేసేందుకు పంక్షన్లకు తీసుకువస్తే…నిన్ను సరిగా చూసుకుంటాడా అని అడిగేవారు. ప్రేమ గుడ్డిది కదా.. ఎవ్వరీ మాట వినిపించుకోలేదు‘ అని పేర్కొన్నారు. సీనియర్ నటులు గిరిబాబు, చలపతిరావు, కృష్ణంరాజు మేకప్ మ్యాన్, ప్రొడ్యూసర్ జయకృష్ణ వంటి నటులు చెప్పి చూశారన్నారు.
చివరికీ ఆలోచిస్తుంటే.. ’నువ్వు పెళ్లి చేసుకోకుంటే..నేను విషం తాగి చచ్చిపోతామన్నారు. రక్తంతో ఉత్తరాలు రాయడం. ఇవన్నీ చూసి సిన్సీయర్ లవ్ అనుకుని.. ఇంత కన్నా మంచి వాడు దొరకడని కరిగిపోయి పెళ్లికి ఒప్పుకున్నా. ఆ తర్వాత గుడిలో పెళ్లి చేసుకున్నాం. అయితే పెళ్లికి ఇష్టం లేకపోయినా మా వాళ్లు వచ్చారు. అయితే ఆ సమయంలో మా వాళ్లు నా ఆస్తికి సంబంధించి పవరాఫ్ అటార్నీటీ చేయించారు. పిల్లలు పుట్టాక నీ ఆస్తి ఇస్తామన్నారు. అయితే పెళ్లైన వారానికే నా భర్తకు ఈ విషయం తెలిసి, ఫవరాఫ్ అటార్నిటీ క్యాన్సిల్ చేయమని అడిగారు. అప్పుడు అర్థమౌంది ..నన్ను ఆస్థి కోసమే చేసుకున్నారు. మూడు నెలలు కాపురం చేశాక.. నాలుగు నెలల నుండి గొడవలు మొదలయ్యాయి. ఏడాది కూడా కాపురం చేయకుండానే విడిపోయాం. అయితే నన్నుగదిలో బంధించి యాసిడ్ పోసేస్తానని, చంపేస్తాను.. లగేజీ అంతా పెట్టేసి హింసించారు’ అని వ్యాఖ్యానించారు.
ఆ సమయంలో చలపతిరావు, గోపాలకృష్ణ వచ్చి ఆ ఇంట్లో నుండి విడిపించారు‘ అని వ్యాఖ్యానించారు. ఆ నరకంలో నుండి తనను బయటపడేశారన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. శృతి లయలులో చిన్న క్యారెక్టర్ చేయగా.. కమల్ హాసన్ ఇంద్రుడు, చంద్రడు సినిమాతో సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ చేశారు. సీరియర్ వంశీ దర్శకత్వంలో పలు సినిమాలు చేశారు. ఏప్రిల్ 1 విడుదల, గోపి, గో్పి, గో్దావరి, జంబలకిడి పంబా, ఆ ఒక్కటి అడక్కు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, జోకర్, మెకానిక్ అల్లుడు, భరత్ అను నేను, ఓరీ దేవుడా వంటి సినిమాల్లో పలు పాత్రలు చేశారు. ఆ తర్వాత బుల్లి తెరపైకి వచ్చి సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టారు. గోరంత దీపంలో వచ్చిన దుర్గమ్మ క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది. అంతేకాకుండా ముత్యాల ముగ్గు, రాధా గోపాలం, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్స్ లో కనిపించారు.