చెన్నై- తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వివాదం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. న్యాయపోరాటం తరువాత ఎట్టకేలకు జయలలిత ఇంటి తాళాలు ఆమె అన్న కూతురు, కుమారుడు దీప, దీపక్ చేతికి వచ్చాయి. ఈ మేరకు దీప శుక్రవారం గృహ ప్రవేశం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2015 డిసెంబర్ 5న ఆకస్మిక మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదాలకు దారితీసింది. […]
తమిళనాడులో అమ్మ అనగానే అందరికి గుర్తుకు వచ్చేదే జయలలిత. ఆమె రాజకీయ పోరాటం ఎంతో మంది మహిళలకు ఆదర్శం. తమిళనాడులో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. రెండో పర్యాయం సీఎం గా ఉన్న జయలలిత ఆనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకుపైగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. అనంతరం అన్నాడీఎంకేలో చీలికలు, వివాదాలు మొదలయ్యాయి. అలాంటి వివాదంలో ఉన్న జయలలిత నివాసం వేదనిలయంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. […]