అమెరికా వెళ్లనున్న మోదీ.. తాలిబన్లే ప్రధాన అజెండా

Modi Going to America - Suman TV

ఈ నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రధానంగా అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలనపై చర్చించనున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీతో ఆయనకు ఇదే మొదటి భేటి.Modi Going to America - Suman TVఅఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత స్థితిగతులు, కోవిడ్‌19, క్లైమెట్‌ చెంజ్‌, టెర్రరిజం అంశాల చర్చకు రానున్నాయి. ప్రధాని విదేశీ టూర్‌ షెడ్యూలింగ్‌ టీం ఈ నెల 9న అమెరికాకు వెళ్లనుంది. 23న ప్రధాని మోదీ అమెరికా వెళ్లనున్నారు. బైడెన్‌తో భేటీతో ప్రధాని పర్యటన మొదలవుతుంది. మరికొంత ప్రముఖులతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా 25న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో మోదీ ప్రసంగించి, అనంతరం భారత్‌కు తిరుగుపయనం అవుతారు. కాగా ఈ ద్వైపాక్షిక భేటీలో తాలిబన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.