అమెరికా అధ్యుడిని టార్గెట్ చేస్తూ.. వైట్ హౌస్ వద్ద దాడికి యత్నించిన కేసులో తెలుగు యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాలు..
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాల్లోకి భారత సంతతికి చెందిన తెలుగు యువకుడు ఒకరు ట్రక్కుతో దూసుకురావడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు,ఆయన కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరిని చంపేందుకు కుట్ర పన్నారన్న కేసులో సదరు యువకుడిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆ కుర్రాడిని 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌గా గుర్తించారు. యూహాల్ అనే పేరుతో.. నాజీ జెండా ఉన్న ట్రక్‌లో సాయి వర్షిత్ వైట్ హౌస్ వద్ద కలకలం రేపాడు. అక్కడ ఉన్న బారికేడ్స్‌ను ట్రక్‌తో ఢీ కొట్టి వైట్‌హౌస్‌లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు.
మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్ సోమవారం రాత్రి 9:40 సమయంలో లాఫాయెట్ పార్క్‌కు సమీపంలో ఉన్న హెచ్ స్ట్రీట్ 1600 బ్లాక్‌లోని బోలార్డ్‌లపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఈ సంఘటన జరిగిన వెంటనే.. యూఎస్ పార్క్ పోలీసులు, యూఎస్ సీక్రెట్ సర్వీస్ యూనిఫాం విభాగం అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతన్ని విచారిస్తే అమెరికా అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్‌ను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ చంపేందుకు కుట్ర పన్నినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. సాయి వర్షిత్‌ను అరెస్టు చేసిన సమయంలో ట్రక్‌లో నాజీ జెండాను గుర్తించినట్టు పోలీసులు వివరించారు. అమెరికా అధ్యక్షుడిపై దాడికి ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్టు సాయి వర్షిత్ తమ దగ్గర ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకరమైన ఆయుధంతో దాడి చేయడం, వెహికల్‌ను నిర్లక్ష్యంగా నడపడం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లేదా వారి కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడం, కిడ్నాప్ చేయడం లేదా హాని కలిగించడం, ప్రభుత్వం ఆస్తిని నాశనం చేయడం, చట్టాన్ని అతిక్రమించడం వంటి అభియోగాలపై సాయి వర్షిత్‌పై కేసు నమోదు చేశారు. ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్ కందుకూరు 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లుగా గుర్తించారు.
BREAKING 🚨 The moment U-Haul truck crashes near White House in Lafayette Square (Video: Chris) pic.twitter.com/Su5R5Q8QjQ
— Insider Paper (@TheInsiderPaper) May 23, 2023