భారతీయ అమెరికన్ అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టనున్న తొలి భారతీయ అమెరికన్ గా అజయ్ బంగా చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ బ్యాంక్ కు అమెరికన్లు మాత్రమే అధ్యక్షులుగా ఉన్నారు.
అజయ్ బంగా.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఆయన ప్రపంచ బ్యాక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూన్ 2 నుంచి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. ఫిబ్రవరి 23న అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు. బుధవారం ప్రపంచ బ్యాంక్ 25 మంది ఎక్జిగ్యూటివ్ సభ్యులున్న బోర్డు అజయ్ బంగాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అజయ్ బంగా ఐదేళ్ల పాటు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. అజయ్ బంగా నామినేషన్ సందర్భంగా జో బైడెన్ ఎంతో గొప్పగా మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి- ఉపాధి కల్పించిన ఎన్నో గొప్ప కంపెనీలకు అజయ్ బంగా నాయకత్వం వహించారు. ఆర్థికాభివృద్ధి విషయంలో అజయ్ బంగా తనని తాను నిరూపించుకున్నారు అంటూ జో బైడెన్ చెప్పుకొచ్చారు. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎంపికవ్వడంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నిజానికి ప్రపంచ్ బ్యాంకుకు అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ అజయ్ బంగా కావడం విశేషం. ఇప్పుడు అసలు అజయ్ బంగా ఎవరు? ఆయన ఏం చేసేవారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
నవంబర్ 10, 1959లో అజయ్ బంగా పూణెలో జన్మించారు. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా.. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో రిటైర్ అయ్యారు. అజయ్ బంగాకు హైదరాబాద్ తో కూడా అనుబంధం ఉంది. ఆయన షిమ్లా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేశారు. తర్వాత ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1981లో నెస్లే కంపెనీలో తన కెరీర్ ని ప్రారంభించారు. ఆ కంపెనీలో 13ఏళ్ల పాటు సేల్స్, మార్కెటింగ్, జనరల్ డిపార్ట్ మెంట్లలో పనిచేశారు. తర్వాత పెప్సికో కంపెనీలో చేరి కీలకపాత్ర పోషించారు. మాస్టర్ కార్డ్ కంపెనీలో సీఓఓగా విధులు నిర్వహించిరు. ఆ తర్వాత ఆ కంపెనీకి సీఈవో అయ్యారు.
2012లో అజయ్ బంగా కృషికి ఫారన్ పాలసీ అసోసియేషన్ మెడల్ దక్కింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో అజయ్ బంగా చేసిన సేవలకు 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. మరెన్నో మెడల్స్ ని అందుకున్నారు. 2021 డిసెంబర్ లో మాస్టర్ కార్డ్ సీఈవోగా రిటైర్ అయ్యారు. 2022లో జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ట్రైలేటర్ కమిషన్ మెంబర్ గా కూడా ఉన్నారు. యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం ఫౌండింగ్ మెంబర్ కూడా. అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కావడంపై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“A man’s achievements in life are the fruits of his ability to think and act.” – Henry David Thoreau. And #AjayBanga ‘s ability to think & act with blinding speed is what sets him apart. To meet him is to encounter a ball of unstoppable kinetic energy. Go do your thing, Ajay, &… https://t.co/XyeFBvMcoZ
— anand mahindra (@anandmahindra) May 4, 2023