ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?!.

గోరింటాకు గౌరీదేవి ప్ర‌తీక. గౌరి ఇంటి ఆకు – గోరింటాకుగా మారింద‌ని మ‌న పురాణాలు చెబుతున్నాయి. గోరింటాకు పుట్టుక వెనుక ఒక క‌థ ఎక్కువ‌గా ప్రాచుర్యంలో ఉంది. భార‌తీయులు పాటించే ప్ర‌తి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.  అనాది నుంచి నేటి టాటూల యుగం వ‌ర‌కు అమ్మాయిల‌కు ఎవ‌ర్‌గ్రీన్ ఫ్యాష‌న్ ట్రెండ్‌గా మారిందీ గోరింటాకు. అందుకే పెండ్లి అయినా పెరంట‌మైనా పండుగ అయినా ఫంక్ష‌న్ అయినా  గోరింటాకు పెట్టుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ‌రీ ముఖ్యంగా ఆషాఢ‌మాసం వ‌చ్చిందంటే చాలు ఆడ‌బిడ్డ‌లు త‌మ చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటుంటారు. అయితే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక పెద్ద కార‌ణ‌మే ఉంది.
Mehendhi01 minజ్యేష్ఠ మాసంలో  మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు. ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. సంస్కృతంలో ‘మెహెందీకా’ నుండి ‘మెహెందీ’ అన్న పదం పుట్టింది.

పసుపు, గోరింటాకుల వినియెాగం వేదాలలోను, ధార్మిక గ్రంథాలలోను వివరించబడింది. హల్దీ మెహెందీ, సూర్యుని భాగాలకు ప్రతీకలుగా పేర్కొన్నారు. బారత, శ్రీలంకా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మహిళలు పెళ్ళికి, పండుగలకు, సాంప్రదాయ ఉత్సవాలలో గోరింటాకు విరివిగా వాడుతారు. 5 వేల సం.  ముందే అరబ్బులు గోరింటాకును అదృష్టానికి చిహ్నంగా భావించేవారు.

ఈజిప్ట్ సమాధులలోని మమ్మీలకు గోర్లు, వెంట్రుకలలో ఎరుపు గోధుమ రంగు మరకలు గోరింటాకేనని నిరూపించబడినది. రోరింటాకు ఈజిప్టులో పుట్టి భారతదేశానికి ప్రాకింది. క్రీ.పూ.700లలో భరతదేశంలో హెన్నా వాడిన రుజువులు వున్నాయి.