ధోనీ మళ్లీ తండ్రి కాబోతున్నాడా, అందుకే సాక్షి అలా కనిపించిందా

స్పోర్ట్స్ డెస్క్- మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో తన సత్తా ఎంటో అందరికి చూపించాడు. అలా ఒక్కసారి కాదు.. వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇదిగో ఇటువంటి సమయంలో ధోనీ మరో తీపి కబురును చెప్పబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఎంఎస్ ధోని భార్య సాక్షి ఫొటోలు వైరల్ కావడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచాక, ధోని భార్య సాక్షి ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో పోస్టా కావడం ఆసక్తికరంగా మారింది. ఇంతలా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.

ms dhoni 1

ఈ ఫొటోల్లో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆమె మళ్లీ తల్లి కాబోతోందా అన్న అనుమానం కలుగుతోంది. త్వరలోనే ఎంఎస్ ధోని తండ్రి కాబోతున్నాడన్న వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అయితే సాక్షి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నదాంట్లో ఎంత మేర నిజం ఉందో అన్నది మాత్రం తెలియదు. ఈ అశంపై ఎంఎస్ ధోని, సాక్షి ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా స్పందించలేదు.

ధోనీ సతీమణి సాక్షి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని , ఆ కుటుంబంలోకి 2022 లో కొత్త సభ్యుడు రాబోతున్నాడని సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకేముంది అభిమానులు ఎంఎస్ ధోని దంపతులను శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. అన్నట్లు ధోనికి 2015 లో ఒక కూతురు పుట్టింది. ఆమెకు జీవా అని పేరు పెట్టారు.