హఠాత్తుగా ఆగిపోయిన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్

న్యూ ఢిల్లీ- ఇది సోషల్ మీడియా యుగం. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్.. ఇవి లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియా లేనిదే ఒక్క క్షణం కూడా గడవదు. వాట్సాప్ లో ఛాట్ చేసి, ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి, ఇన్ స్టాగ్రామ్ లో సంగతులు తెలుకుంటేనే గాని ఇప్పుడు సమయం ముందుకు వెళ్లడం లేదు.

మరి అలాంటిది హఠాత్తుగా సోషల్ మీడియా అగిపోతే.. అమ్మో ఉహించుకోవడానికే భయంగా ఉంది కదా. కానీ నిజంగానే సోమవారం రాత్రి కొంత సేపు సోషల్ మీడియా స్తంబించిపోయింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌ స్టాగ్రామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొంత సమయం పాటు ఈ సోషల్ మీడియా సంస్థలు పని చేయలేదు. రోజంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే నెటిజెన్లకు సోమవారం రాత్రి 9 గంటల తరువాత ఈ అవాక్కయ్యే సంఘటన సంభవించింది.

Face book 1

ఫేస్‌ బుక్ కేంద్ర కార్యాలయంలో వతలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం. ఐతే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ఉన్నట్టుండి నిలిచిపోవడంపై అంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఫేస్ బుక్ స్పందించింది. క్షమించాలి, ఏదో తప్పిదం జరిగింది, దానిపై మేము పనిచేస్తున్నాం. సమస్యను త్వరలోనే పిరష్కరిస్తాం.. అని ఫేస్ బుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

మరోవైపు వాట్సాప్ సైతం సేవల్లో అంతరాయంపై స్పందించింది. వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది వాట్సాప్. ఫేస్ బుక్ కు భారత్ లో 41 మంది యూజర్లు ఉండగా, వాట్సాప్ ను 53 కోట్ల మంది, ఇన్ స్టాగ్రామ్ ను 21 కోట్ల మంది వాడుతున్నారు. ఇక ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ ఆగిపోవడంపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు ఆగిపోయిన వాట్సాప్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు పునరుద్దరించారు.