ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా బయటపడ్డ రూ.745కోట్ల రత్నాల రాయి!

big stone infront of home

అదృష్టం.. ఎప్పుడు, ఎవరిని, ఎలా పలకరిస్తుందో అస్సలు చెప్పలేము. లక్ బాగుంటే నిమిషాల్లో కోటీశ్వరులం అయిపోవచ్చు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా శ్రీలంకలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అతను ఓ రత్నాల వ్యాపారి. తన ఇంటి పెరట్లో బావి తవ్విస్తూ ఉన్నాడు. అయితే.., కొంత లోతు తీశాక ఓ పెద్ద బండరాయి అడ్డుగా తగిలింది. దీంతో.., మెషీన్స్ తెప్పించాలని నిర్ణయించుకున్నాడు. అయితే.., ఆ కూలీల్లో ఓ అతనికి అనుమానం వచ్చింది. ఆ బండరాయి చుట్టూ కొంత దూరం తవ్వుకుంటూ పోయాడు. అంతే అద్భుతం బయట పడింది.

అందరూ అనుకున్నట్టు అది బండరాయి కాదు. ప్రపంచ మార్కెట్ లో అత్యంత విలువైన నీలమణులు రత్నాల రాయి. అంటే ఒక పెద్ద రాయిలో అనేక చిన్న చిన్న ఇంద్రనీలపు రాళ్లు ఉంటాయి. దీన్ని నీలమణుల క్లస్టర్ అని పిలుస్తారు. భూమి లోపల సహజ సిద్ధంగా ఏర్పడే ఇలాంటి నీలమణులు రత్నాల రాయి బయట పడటం అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. ఇక ఇక్కడ దొరికిన నీలపు రాయి బరువు 510 కేజీలు ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన నీలమణుల్లో ఇదే అత్యంత పెద్దది. దీని విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.745 కోట్లు.

Rs.745 croresనిజానికి శ్రీలంకలో మణులు, రత్నాలు అధికంగా దొరుకుతాయి. ఇక లంకలోని రత్నపుర ప్రాంతంలో ఇప్పటికే చాలా మందికి చిన్న చిన్న మణులు దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే ఈ నీలపు రాయి బయట పడటం విశేషం. ఇక రాయి బయటపడిన వెంటనే వ్యాపారి.. అధికారులకు తెలియచేశాడు. అక్కడికి చేరుకున్న అధికారులు సైతం అంత పెద్ద రాయిని చూసి బిత్తరపోయారు. ఇది సుమారు 40 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుంది” అని ప్రఖ్యాత జెమ్మాలజిస్ట్ డాక్టర్ గామిని జోయిసా అంచనా వేశారు.

ఇది ప్రత్యేకమైన స్టార్ నీలమణి నమూనా. బహుశా ప్రపంచంలోనే అతి పెద్దది. దీంతో.., దీన్ని ఎవరైనా ప్రయివేట్ వ్యక్తులు రూ.1000 కోట్ల సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అయితే.., శ్రీలంక రూల్స్ ప్రకారం ఎక్కడ వజ్రాలు దొరికినా అవి ప్రభుత్వ సొంతం. కాకుంటే.., ఎవరికైతే వజ్రం దొరుకుద్ధో వారికి ప్రభుత్వం కొంత వాటాని ఇస్తుంది. ఈ లెక్కన చూసుకున్నా.., ఆ ఇంటి యజమానికి కూడా వందల కోట్ల రూపాయలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.., ఇంత పెద్ద వజ్రాల రాయి దక్కించుకున్న ఆ వ్యాపారి అదృష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.