పిల్లల్ని కనడంలో రికార్డ్ సృష్టించిన్న దక్షిణాఫ్రికా వనిత!..

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా అనే నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే   అనే   మహిళ ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మే నెలలో మొరాకోకు చెందిన మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది. అత్యధిక మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆమె రికార్డును నెల తిరిగేలోగానే సితోలే చెరిపేసింది. ఆమె ఏడ నెలల ఏడు రోజుల గర్భవతి. ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మే 7న ఆమె ప్రిటోరియా హాస్పిటల్‌లో పది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం కష్టం కావడంతో వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమె కడుపులోని బిడ్డలను బయటకు తీసినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

iStock 457162975.width 800సితోలే ప్రటోరియా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆమె గతంలోనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం వారి వయసు ఆరేళ్లు. రెండో కాన్పులో ఆమెకు ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, సిథోల్ వారిని సాధారణ విధానంలోనే ప్రసవించినట్లు తెలపడంతో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ప్రసవానికి ముందు జరిపిన పరీక్షల్లో ఆమె కడుపులో ఆరుగురు పిల్లలే పెరుగుతున్నారని భావించారు. అయితే, ప్రసవం సమయంలో పది మంది పిల్లలు కనడంతో ఆశ్చర్యపోయారు. కవల పిల్లలకు జన్మనివ్వడమంటేనే పెద్ద సాహసం. అలాంటిది సితోలే ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 10 మంది పిల్లలను ఒకే కాన్పులో ప్రసవించి ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ ఈ ఘనత సాధించకపోవడంతో ఆమె వరల్డ్ రికార్డు ఖాతాలో చోటు సంపాదించే అవకాశాలున్నాయి. పిల్లలంతా సురక్షితంగానే ఉన్నారని, కొన్ని నెలలు వారిని ఇన్‌క్యూబేటర్‌లో ఉంచి పర్యవేక్షించాల్సి ఉందని స్థానిక మీడియా తెలిపింది. అయితే, ఈ ఘటనను హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.