మనిషి ప్రాణాలు ఏ క్షణంలో ఎలా పోతాయో తెలియదు. అప్పటి వరకు మనతోపాటే ఉంటూ అంతలోనే మనకు దూరమయ్యారు అన్న వార్త వింటే ఎంత బాధ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ప్రమాదాల్లో నుంచి ఐనవారు బతికి బయట పడితే ఎంతో సంతోషంగా ఉంటుందో.. ఆ ప్రమాదం నుంచి రక్షించిన వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే ఔరా అనిపించేలా ఉంటున్నాయి.
ఇలాంటి వీడియోలు మంచి, చెడు ఉంటున్నాయి. కొందరిలో మంచితనం ఇంకా ఉంది అని అనిపిస్తుంటుంది. తమ ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలు కాపాడటం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి సంఘటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. క్షణాల్లో ఓ బాలుడిని పారిశుధ్య కార్మికుడిని రక్షించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న పిల్లలు తమకు తెలియకుండా బయటకు వస్తే.. ఆ సమయంలో తల్లిదండ్రులు.. ఐనవాళ్లు ఎవరూ లేకుంటే ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అపార్టు మెంట్ పై నుంచి పడటం.. రోడ్డుపైకి వచ్చి ప్రమాదాలకు గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఓ బాలుడు రోడ్డు పై వస్తున్న కారు కింద పడిపోయే సమయంలో పారిశుద్ద్య కార్మికుడు వెంటనే మేల్కొని ఆ బాలుడిని రక్షించాడు.
రెక్స్ చాప్ మన్ ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. ఓ ఇంటి గేటు తెరుచుకొని ఉండటంతో ఇంట్లో బాలుడు ఇంటి బయటకు వచ్చాడు. రోడ్డుపై అటూ..ఇటూ చూశాడు. ఓ చెత్త ట్రాక్టర్ వచ్చింది. ఆ ట్రాక్టర్ కొద్దిగా ముందుక కదలగానే బాలుడు రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు.. కానీ అవతలి వైపు నుంచి ఓ కారు అతి వేగంగా రాడం పారిశుద్ద్య కార్మికుడు చూసి వెంటనే వాహనం నుంచి కిందకు దిగి.. బాలుడిని పక్కకు లాగేశాడు. మొత్తానికి ఆ బాలుడికి.. అతనికి ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డారు. ఇదంతా ఇంటి వద్దనున్న సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. తాజాగా రెక్స్ చాప్ మన్ ట్విట్టర్ వేధికగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
If you’ve already seen a sanitation worker save a little boy’s life today just keep on scrolling… pic.twitter.com/lVG44aSnco
— Rex Chapman🏇🏼 (@RexChapman) September 5, 2021