ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా జాతర్లకు పోయినపుడు సాధారణంగా పిల్లలు తప్పిపోతుంటారు. అక్కడున్న జనం రద్దీ దృష్ట్యా కనిపించకుండా పోయి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లిపోతారు. ఆ తరువాత తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూకి దొరకక, తమ పిల్లల జాడ తెలియక మనోవేధన అనుభవిస్తుంటారు.
ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా జాతర్లకు పోయినపుడు సాధారణంగా పిల్లలు తప్పిపోతుంటారు. అక్కడున్న జనం రద్దీ దృష్ట్యా కనిపించకుండా పోయి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లిపోతారు. ఆ తరువాత తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూకి దొరకక, తమ పిల్లల జాడ తెలియక మనోవేధన అనుభవిస్తుంటారు. తప్పిపోయిన పిల్లల కోసం తల్లిదండ్రులు చేయని ప్రయత్నం ఉండదు. ఇదే రీతిలో పదమూడేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు పెరిగి పెద్దైన తరువాత కుటుంబసభ్యుల చెంతకు చేరాడు. తమ కొడుకు తిరిగి రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు సంతోషంలో మునిగిపోయారు. ఈ ఘటన ఎపిలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంత పురం జిల్లాకు చెందిన శివ అనే బాలుడు పదమూడేళ్ల వయసులో ఇంట్లోనుంచి వెళ్లిపోయి మళ్లీ 26 ఏళ్ల వయసులో తిరిగి వచ్చాడు. అనంతపురం లోని ధర్మవరానికి చెందిన శివ తల్లి అతడికి పదమూడేళ్ల వయసున్నప్పుడు చనిపోయింది. దీంతో శివ దుఖంలో మునిగిపోయాడు. తల్లి మరణంతో దిగులు చెందిన శివ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతకని ప్లేస్ లేదు. ఎక్కడికి పోయాడో ఏమో అని అతడి పై ఆశలు వదులుకున్నారు. కాగా తాజాగా తప్పిపోయిన శివ ఉరవకొండలో ఓ టీ కేఫ్ లో ఉన్నట్లుగా ధర్మవరానికి చెందిన కొందరు వ్యక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అందించారు. సమాచారం అందుకున్న వారు ఉరవకొండకు చేరుకుని శివను చూసి బావోద్వేగానికి లోనయ్యారు. శివతో ముచ్చటించిన కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.