బొద్దింకకు అత్యవసర వైద్యం… ఇది మానవత్వం ఉంటేనే సాధ్యం!

AMER COC

ధాయిలాండ్ లో కీటకాల్ని తింటారని మనం అనుకుంటాం వీడియోలో చూస్తాం. కానీ ఈసారి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏకంగా ఓ బొద్దింకను ఐసీయులో పెట్టి ఆక్సిజన్ అందించారు. గాయాలతో చావుబతుకులతో పోరాడుతున్న దాన్ని బతికించేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని క్రతుమ్ బ్యాన్ ప్రాంతానికి చెందిన దను లింపపట్టనవానిచ్ అనే యువకుడు రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే.. అతడికి ఓ బొద్దింక కనిపించింది. ఎవరో దాన్ని పొరపాటున తొక్కేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బొద్దింక అక్కడి నుంచి కదల్లేక విలవిల్లాడుతోంది. దాని పరిస్థితి చూసి దను మనసు కరిగిపోయింది. దాన్ని ఎలాగైనా కాపాడాలని దను నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడు తన చేతినే అంబులెన్సుగా మార్చేశాడు. ఆ బొద్దింకను తన అరచేతిలో పెట్టుకుని సాయి రాక్ యానిమల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ఈ అరుదైన వింత ఘటన గురించి ఆ డాక్టరే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. ఆ బొద్దింక బతికేందుకు 50 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయని ఆ డాక్టర్ తెలిపాడం జరిగింది.

american cockroach illustration 1376x1147

 

ఒక మానవత్వం వున్న మనిషిగా ప్రతి జీవి పట్ల కరుణ, జాలి. లోకంలో ప్రతి జీవి జీవితం విలువైనది.ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు మరింత మంది ఉండాలని కోరుకుంటున్నాను.ఈ లోకానికి దయకలిగిన మనుషులు ఎంతో ముఖ్యమని తెలిపాడు. ఆ డాక్టర్ లింపపట్టనవానిచ్ కూడా ఆ బొద్దింకను ఎమర్జెన్సీ పేషెంట్‌గానే భావించాడు. దానికి ఉచితంగా వైద్యం చేస్తానని ‘దను’ కు మాటిచ్చాడు. ఆ బొద్దింక బ్రతికి బయటపడిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాలని అతడికి చెప్పాను. ఇందుకు అతడు అంగీకరించడం జరిగిందని డాక్టర్ తెలిపాడు.