అత్తకు ‘బాయ్ ఫ్రెండ్’ కావలె రా!..

ఇప్పటివరకు ప్లాట్లు, ఉద్యోగాలు, వాణిజ్య ప్రకటనలే చూసిన మనకు ఈ ప్రకటన కాస్తా కొత్తగానే ఉంటుంది. అత్త కోసం బాయ్​ఫ్రెండ్​ను ఏర్పాటు చేయాలనుకున్న ఓ కోడలు ఏకంగా ఓ వైబ్​సైట్​లో ప్రకటన ఇచ్చేసింది. అమెరికాలోని న్యూయార్క్​కు చెందిన ఓ కోడలు తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్​ ఫ్రెండ్​గా అద్దెకు కావాలని క్రెయిగ్స్​లిస్ట్​ అనే క్లాసిఫైడ్స్​ వెబ్​సైట్​లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్​ అయ్యింది.

Old Woman Dating 01 min51 ఏళ్ల అత్తయ్యతో కాస్తా సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తి తోడుగా కావాలట. అందుకోసం 960 డాలర్లు (రూ.72వేలు) ఇస్తానని తెలిపింది. అంతేకాదు దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని షరతులు విధించింది. బాయ్ ఫ్రెండ్ గా వచ్చే వారికి బాగా డ్యాన్స్ చేయడంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని కోడలు స్పష్టం చేసింది. ఈ కోడలి ప్రకటన కండీషన్లపై నెటిజన్లు చమత్కారంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తుండడం ట్రెండింగ్ అవుతోంది.

ముఖ్యంగా మన దేశంలోని వారు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఎమోజీలు జత చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట్లో వైరల్‌ అవుతుండగా  దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెడీ టచ్ తో  స్పందిస్తున్నారు.