యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్– కొందరిని దురదృష్టం వెంటాడుతుంటే.. మరి కొందరిని అదృష్టం పట్టిపీడిస్తుంది. కానీ చాలా కొంత మందిని మాత్రమే అదృష్టం.. ఆ వెంటనే దురదృష్టం కూడా వరిస్తుంది. అదృష్టం, దురదృష్టం రెండు ఒకేసారి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఐతే మీరు దుబాయ్ లో ఓ భారతీయుడికి జరిగిన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.
దుబాయ్ లో నివాసం ఉంటున్న ఓ కేరళ వాసుడికి అదృష్టం వరిచింది. అతనికి లాటరీలో ఏకంగా 20 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ అతనికా విషయం తెలియదు. అంటే అతని ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు. దీంతో లాటరీలో 20 కోట్ల రూపాయలు గెలిచిన విషయం అంతనికి తెలియదన్నమాట. కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ దుబాయ్ లో ఉంటున్నాడు.
ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబూదాబి సిరీస్ 232 లాటరీ డ్రాలో అతడు ఏకంగా 10 మిలియన్ దుబాయ్ దిర్హామ్‌లు గెలిచాడు. సెప్టెంబర్ 26న నహీల్ ఈ లాటరీ టిక్కెట్ కొనగా, ఇలా అనూకోకుండా అతడిని అదృష్టం వరించింది. అసలు విషయం ఏంటంటే.. లాటరీ టిక్కెట్టు కొనే సమయంలో నహీల్ నిజాముద్దీన్ కేరళలో ఉన్న అడ్రస్‌ను రాశాడు. అంతే కాదు తనకు సంబందించిన రెండు సెల్ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు.
తీరా ఇప్పుడు లాటరీ గెలిచిన విషయాన్ని అతడికి ఫోన్ ద్వారా చెబుదామని లాటరీ నిర్వాహకులు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఎందుకంటే అతడినిచ్చిన రెండు సెల్ ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ లు మాత్రం స్పందించడం లేదు. కానీ లాటరీలో అతను 20 కోట్ల రూపాయలు గెలుచుకున్న విషయాన్ని నహీల్‌కు సమాాచారం ఇచ్చేంత వరకూ ప్రయత్నిస్తూనే ఉంటామని లాటరీ నిర్వాహకులు తెలిపారు.
అన్నట్లు సౌదీ అరేబియాలో నివసిస్తున్న యాంజెలో ఫర్నాండెజ్ కూడా ఈ లాటరీలో రెండో బహుమతిగా 1 మిలియన్ దిర్హామ్లను గెలుపొందాడు. మరి మన కేరళ వాస్యవ్యుడు నహీల్ నిజాముద్దీన్ కు తాను లాటరీలో 20 కోట్ల రూపాయలు గెలిచిన విషయం సాధ్యమైనంత త్వరగా తెలియాలని కోరుకుందామా..