పెళ్ళికొచ్చిన వాళ్లకి పోలీసుల రిటర్న్ గిఫ్ట్! – వెయ్యేసి రూపాయల వడ్డింపు!..

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు.కరోనా కట్టడికై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్, కర్ఫ్యూలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఆంక్షల్లో భాగంగా ఏదైనా వేడుకలకు, శుభకార్యాలకు, కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. కొన్ని చోట్ల పెళ్లి చేసుకోవాలంటే అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ టీచర్ వివాహ వేడుకకు 250 మంది హాజరు అయ్యారు.దీంతో పోలీసులు ఆ వరుడికి రూ.2 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామంలో ఓ పెళ్లి వేడుక జరిగింది. వివాహ వేడుకకు అతిథులు భారీగా తరలి వచ్చారు.కనీసం మాస్కులు కూడా ధరించకుండా గుంపుగా తిరుగుతూ వేడుకలో సందడి చేశారు.దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  రీసెంట్ గా నిబంధనలు ఉల్లఘించి పెళ్ళికి ఎక్కువ సంఖ్యలో హాజరైనందుకు ఆ వధూవరులతో పాటు అతిథులందరికి మనిషికి రూ.1000 చొప్పున పోలీసులు జరిమానా విధించారు.

66a64cca0fe100a9ce82e0a6f226cc95రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు.ఆ వేడుకకు పరిమితికి మించి అతిథులు రావడంతో అధికారులు అక్కడున్న వారందరినీ మందలించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ.వధూవరులతో సహా మిగతా వారందరికీ ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారంతా షాకయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పెళ్లి వారి కుటుంబానికి ఫైన్ వేయాలి గానీ పెళ్లికి వచ్చిన వారికి కూడా జరిమానా వేస్తారా అంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులతో కొందరు గ్రామస్థులు వాగ్యాదానికి దిగారు.నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా ఫైన్ కట్టాల్సిందేనని. దాదాపు 30 మందితో పోలీసులు రూ.వెయ్యి చొప్పున జరిమానా కట్టించుకున్నారు.