యాంకర్ సుమను ఏడిపించిన హీరో నాని, అసలేం జరిగింది

ఫిల్మ్ డెస్క్- బుల్లితెర ప్రేక్షకులకు సుమను పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. తన చలాకీతనంతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది సుమ. తనదైన డైలాగ్స్ తో, టైమింగ్ ప్రకారం పంచులతో ఎంతటి వారికైనా చుక్కలు చూపించే సుమ.. తాజాగా నాచురల్ స్టార్ నాని మాటలకు అవాక్కైపోయింది. చుట్టూ చాలా మంది ఉండగా.. అందరి ముందే నాని సుమను పిలిచిన పిలుపు విని ఆమె ఒక్కసారిగా షాకైంది. టీవీ షో అయినా, సినిమా ఫంక్షన్ అయినా.. తన పంచులతో అందరిని బెదరగొట్టే సుమను నాని మాత్రం హడలెత్తించాడు. నాని దాటికి తట్టుకోలేక దండం పెట్టి నేను వెళ్లిపోతున్నా బాబోయ్ అంటూ జారుకుంది సుమ. ఇంతంకీ ఇదంతా ఎక్కడ జరిగింది.. అసలేం జరిగింది అనే కదా మీ సందేహం.. అసలేం జరిగిందంటే.. సుమ యాంకరింగ్ చేసే బుల్లితెర షో క్యాష్ తెలుసు కదా. ఈ ప్రోగ్రామ్ కి అంతా సెలబ్రెటీలే వస్తుంటారు. ఇక ఈ క్యాష్ షోలో అందరిని తెగ ఆడుకుంటుంది సుమ. అందుకే ఈ షో అంత పాపులర్ అయ్యింది. క్యాష్ ప్రోగ్రామ్ కు ఎవరు వచ్చినా తనదైన స్టైల్ సెటైర్లతో బెంబేలెత్తించే సుమ.. హీరో నాని చేతిలో మాత్రం చిత్తైపోయింది. నాచురల్ స్టార్ నాని సుమపై పంచులమీద పంచులు వేసేశాడు. మే 22న ప్రసారం కాబోతున్న సుమ క్యాష్ షోకు నాని టక్ జగదీష్ టీమ్ మొత్తం గెస్టులుగా వచ్చారు.

nani suma

నానితో పాటు, రీతూ వర్మ, దర్శకుడు శివ, నిర్వాణ ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ విడుదలైంది. ఇందులో యాంకర్ సుమకు హీరో నాని ముచ్చెమటలు పట్టించాడు. సుమ ఆంటీ అంటూ నాని చేసిన హాంగామా అంతా ఇంచా కాదు. నాని తనను పదే పదే అంటీ అని పిలవడంతో.. అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదని సుమ చెబుతుంది. దీంతో ఇంకీ రెచ్చిపోయిన నాని.. ఈ రోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది.. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని.. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం.. అని మళ్లీ మళ్లీ సుమ అంటీ అంటూ ఆమెను ఆటపట్టించాడు. దీంతో అలిగిన సుమ.. షో నుంచి నేను వెళ్లిపోతున్నానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో బాగా వైరల్ అవుతోంది. క్యాష్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ సుమ అందరిని ఆటపట్టిస్తే.. ఈ సారి హీరో నాని సుమను సరదాగా ఏడిపించాడని అంతా కామెంట్ చేస్తున్నారు.