స్టార్ యాంకర్ సుమ ఉందంటే ఆ సందడే వేరు. టీవీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, సినిమా ఫంక్షన్స్, స్పెషల్ ఈవెంట్స్ ఆమె హోస్ట్ చేస్తుందంటే ఇక చెప్పక్కర్లేదు. సందర్భానికి తగ్గట్టు అప్పటికప్పుడు పంచ్‌లు వెయ్యాలంటే సుమ తర్వాతే ఎవరైనా.
స్టార్ యాంకర్ సుమ ఉందంటే ఆ సందడే వేరు. టీవీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్, సినిమా ఫంక్షన్స్, స్పెషల్ ఈవెంట్స్ ఆమె హోస్ట్ చేస్తుందంటే ఇక చెప్పక్కర్లేదు. సందర్భానికి తగ్గట్టు అప్పటికప్పుడు పంచ్‌లు వెయ్యాలంటే సుమ తర్వాతే ఎవరైనా. తన వల్లే కొన్ని షోస్ రన్ అవుతున్నాయంటే.. క్రేజ్ చూస్కోండి మరి. ఇక సుమ హోస్ట్ చేసే వాటిలో ఆమె పేరు మీద వచ్చే ‘సుమ అడ్డా’ షో అయితే మంచి ఆదరణ దక్కించుకుంది. ఎంతోమంది సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుకుని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుమ.. ఈ వారం ఎపిసోడ్‌లో ఎప్పటిలానే సందడి చేయనుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ పాపులర్ గేమ్ షో శనివారం (జూలై 29) ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఈ వీక్ ‘సుమ అడ్డా’ ఆడడానికి చలాకీ చంటి, సిరి హన్‌మంత్, సన్నీ, ఆర్జే కాజల్ వచ్చారు. సుమ తన స్టైల్లో సెటైర్స్ వేస్తూ, వాళ్లతో కలిసి సందడి చేసింది. చంటికి సమోసాలిస్తూ సాలిడ్ పంచ్ వేసింది. రకరకాల గేమ్స్, క్వశ్చన్స్‌తో హంగామా చేసింది. ‘భారతదేశం యూనిఫామ్ నైటీ’ అంటూ అదిరిపోయే పంచ్ వేసింది. ఇక సూరీడు స్పూఫ్‌తో సన్నీని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. ఇక్కడి వరకు సరాదాగా సాగిపోయిన ప్రోమో.. ఒక సర్‌ప్రైజింగ్ థీమ్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ ఫ్యామిలీ ఫిలిం ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ని సెలెక్ట్ చేసుకున్నారు.
చంటి ఆ పేరు చెప్తే.. ఇది టైటిల్‌లా లేదు, మీ రియల్ స్టోరీ ఏదో చెప్తున్నట్టుంది అంటూ అదరగొట్టేసింది. కాజల్.. ‘నేపాల్ నుంచి నాకోసం ఏం తీసుకొచ్చారు?’ అనడిగితే.. ‘నువ్వొక్కదానికి కష్టపడుతున్నావని పనమ్మాయిని తీసుకొచ్చాను.. ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకో. ఓన్లీ సాయంత్రం పూట మాత్రం వదిలేస్తూ ఉండు’ అనగానే సుమ రియాక్షన్ అయితే అదుర్స్. చంటి పంచ్‌లకి అందరూ అరుస్తూ, నవ్వేశారు. చివరకు ‘నేను నేపాల్ వెళ్లలేదు’ అని చంటీ చేత దణ్ణం పెట్టించారంటే ఏ రేంజులో ఆడేసుకున్నారో ఎపిసోడ్‌లో చూడాల్సిందే. ‘సుమ అడ్డా’ లేటెస్ట్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!