సినీ పరిశ్రమలో వివాదలకు తావే ఉండదు,ఈ మధ్య హీరోయిన్సే కాకుండా హీరోలు కూడా కాంట్రవర్సీలు చేస్తు ఉంటారు. తాజాగా నాని కూడా ఈ కోవలోకే వచ్చాడు. పాన్ ఇండియా పదం నాకు నచ్చదని చెప్పుకొచ్చాడు. నాని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మహానటి సినిమాతో మంచి గుర్తింపు పోందిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. తెలుగు లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన సినిమాలను ఇక్కడ కూడా డబ్ చెస్తూ ఉంటాడు. అయితే తాజాగా సల్మాన్ నటించిన “కింగ్ ఆఫ్ కోతా” పాన్ ఇండియా రేంజ్‌లో ఈ నెల 24న విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినీ పరిశ్రమలో వివాదలకు తావే ఉండదు,ఈ మధ్య హీరోయిన్స్ కాకుండా హీరోలు కూడా కంట్రవర్సిలు చేస్తు ఉంటారు. తాజాగా నాని కూడా ఈ కోవలోకే వచ్చాడు. ఈవెంట్ లో బాగంగా పాన్ ఇండియా గురించి మాట్లాడుతూ.. “మనందరం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నాము. కానీ ఆ పదం ఎందుకో నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఉన్నాడంటే అది దుల్కర్ సల్మాను మాత్రమే. ఎందుకంటే ఓ హీంది డైరెక్టర్ దుల్కర్ కోస్ కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదే” అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో మన తెలుగు ఫాన్స్ ఊరుకుంటారా కామెంట్లతో నాని మీద ఫైర్ అవుతున్నారు. దుల్కర్ పాన్ ఇండియా హీరో కావచ్చు కానీ ఇతర హీరోలు పాన్ ఇండియా హీరోలను తక్కువ చేసి మాట్లాడటం అవసరమా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాని ఇండియా హీరోనా తెలుగులో నీకు ఎవరు కనిపించడంలో లేదా అంటూ.. కామెంట్స్ పెడతున్నారు. మరొ కొందరు అయితే నాని ఏకిపారెస్తున్నారు. నువ్వు పాన్ ఇండియా రేంజ్ కి ఎప్పటీకి చేరుకోలేవు కాబట్టీ తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అని అందుకే నీకు పాన్ ఇండియా పందం నచ్చదు కదా అంటూ.. తీవ్రంగా మండిపడుతున్నారు.
సినీ పరిశ్రమలలో ప్రస్తుతం చూసుకుంటే.. పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్, అల్లు ఆర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. వీళ్లందరు ఎవరు? అని మండి పడుతున్నారు. బాలీవుడ్ లో మొదటగా పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ నీకు కనిపించలేదా అంటూ.. కామెంట్ల రూపంలో నానికి చూక్కలు చూపిస్తున్నారు కొందరు నెటిజన్లు. పాన్ ఇండియా హీరో ఎవరనేది మేము డిసైడ్ చేస్తాం. మాకు తేలుసు ఎవరు పాన్ ఇండియా, ఎవరు చిన్న హీరో అని మాకు తెలుసు.. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలతో పాటు కొంచేం నోరు అదుపులో పెట్టుంకుంటే చాలా మంచిది అంటూ ఘాటుగానే కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్లు. మరి నాని వీరి కామెంట్ల పైనా ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి. ఎదూమైనా తెలుగు యాక్టర్ అయ్యుండి తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడం కరెక్ట్ కాదని మరి కొందరి అభిప్రాయం.