డ్రగ్స్‌ కేసు: ఆర్థర్‌ రోడ్‌ జైల్లో షారుఖ్‌ ఖాన్‌.. కన్నీటి పర్యంతం

aryan khan

బాలీవుడ్‌ టాప్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ గురువారం ముంబైలోని ఆర్థర్‌ రోడ్‌ జైలుకు వెళ్లారు. ఆయన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయి కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ను కలిసేందుకు షారుఖ్‌ నేరుగా జైలు కెళ్లారు. తండ్రిని చూసిన ఆర్యన్‌ఖాన్‌ దుఃఖం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. విచారణ సమయంలో ఆర్యన్‌ సరిగ్గా భోజనం చేయడం లేదని అతని ఆరోగ్యం క్షీణిస్తోందని ఎన్సీబీ అధికారులు ప్రకటించిన సందర్భంగా షారుఖ్‌ ఖాన్‌ కొడుకును కలిసేందుకు వెళ్లారు. కాగా పలు మార్లు ఆర్యన్‌ తరఫు లాయర్‌ బెయిల్‌ కోసం అపీల్‌ చేయగా కోర్టు నిరాకరించింది.

ఈ విషయమై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు షారుఖ్‌ ఖాన్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్యన్‌ ఫోన్‌ డేటా ఆధారంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండేను కూడా ఎన్సీబీ అధికారులు గురువారం విచారించారు. అంతకు ముందు షారుఖ్‌ ఖాన్‌, అనన్య పాండే నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో అనన్య పాండే ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను ఎన్సీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ను బీజేపీ కుట్ర పూరితంగా ఇందులో ఇరికించిందని శివసేన నేతలు ఆరోపిస్తూ.. ఆర్యన్‌కు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన అనన్య పాండే! పూరీ జగన్నాథ్‌కు షాక్‌!