సెల్ ఫోన్, సోషల్ మీడియా అనేవి జీవితంలో ఇంపార్టెంట్ అయిపోయాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో సినిమాలు, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ట్రెండీ న్యూస్, గాసిప్స్, మీమ్స్ అయితే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి.
సెల్ ఫోన్, సోషల్ మీడియా అనేవి జీవితంలో ఇంపార్టెంట్ అయిపోయాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో సినిమాలు, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ట్రెండీ న్యూస్, గాసిప్స్, మీమ్స్ అయితే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. అలాగే సందర్భానికి తగ్గట్టు ప్రస్తుత పరిస్థితిని సినిమా సీన్‌తో, డైలాగ్‌తో కంపేర్ చేయడం.. ఓ మూవీని మరో మూవీతో పోల్చడం మీమ్స్ రాయుళ్ల స్పెషాలిటీ. ఇటీవల ‘సలార్’ టీజర్ రిలీజ్ చేయగా.. క్షణాల్లో దానిలోని షాట్స్ ఆధారంగా KGF 2 తో కనెక్షన్ ఉందని కనిపెట్టేశారు. ఇప్పుడలానే టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కాపీ కొట్టాడు.. ఫాలో చేశాడు అంటూ క్రేజీ కంపేరిజన్ చెప్తున్నారు. దీని గురించి ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ‘కింగ్ ఖాన్’ షారుఖ్ ఖాన్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. ‘లేడీ సూపర్ స్టార్’ నయన తార హీరోయిన్ కాగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. ప్రియమణి ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా.. దీపిక పదుకొణె గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు. జూలై 10న ‘జవాన్ ప్రివ్యూ’ పేరుతో విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘పఠాన్’తో బాలీవుడ్‌ని సేఫ్ చేసిన షారుఖ్.. తన వన్ మెన్ షోతో ఈసారి బాక్సాఫీస్‌పై భారీ స్థాయిలో దండయాత్ర చేయబోతున్నాడని అర్థమైపోతుందంటూ అన్ని చోట్ల నుండి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. డిఫరెంట్ గెటప్స్, బాడీ లాంగ్వెజ్‌తో బాద్‌షా అదరగొట్టేశాడు.
ఇక బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో ‘భగవంత్ కేసరి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయిక. శ్రీలీల ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుంది. నటసింహా పుట్టినరోజు నాడు వదిలిన టీజర్ కిరాక్ ఉంది. బాలయ్య తన ఏజ్‌కి తగ్గ పాత్రలో, హిందీ డైలాగ్స్‌తో, తన స్టైల్ మేనరిజమ్‌తో మెస్మరైజ్ చేశాడు. ఇక టీజర్ చివరిలో విజిల్ వేస్తూ, స్మైల్ ఇవ్వడం.. తర్వాత ఫుల్ జోష్‌తో గిటార్ ప్లే చేస్తుండడం ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. ‘జవాన్’ ప్రివ్యూ వీడియో చివర్లో కూడా షారుఖ్ కూడా.. ఏఎన్నార్ ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాలోని ‘ఈ మౌనం, ఈ బిడియం’ సాంగ్ ప్లే అవుతుండగా స్టెప్స్ వేస్తాడు. మీమ్స్ పేజెస్ వాళ్లు, ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఈ రెండిటికీ పోలిక కుదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘బాలయ్య బస్‌లో, షారుఖ్ మెట్రో ట్రైన్‌లో ఇలా ఎనర్జిటిక్‌గా వీడియోస్ ఎండ్ చేశారు.. షారుఖ్, బాలయ్యని కాపీ కొట్టాడు.. జవాన్ వీడియో చివర్లో బాలయ్యను గుర్తు చేశాడు’ అంటూ వీడియో, స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.
#NBK x @iamsrk 🥳🥳#JawanPrevue #BhagavanthKesari pic.twitter.com/I3kf92Lwt7
— Meee (@RampRaadha) July 10, 2023
#Jawan #JawanPrevueOn10July #JawanPrevue #ShahRukhKhan #SRK #BalaKrishna #Atlee #Nayanthara #BhagavanthKesari
Jawan Srk prevue ending vs bhagavanthKesari Nbk ending quite similar 🤩🕵️♂️😅😅😅 pic.twitter.com/48kTIF0Lvd
— GenuineReviewMovies (@Geniunereview) July 10, 2023
#JawanPrevue last 20 seconds train bit reminded me #BhagavanthKesari teaser last 10 seconds bus bit #Jawan #JawanPrevueOn10July pic.twitter.com/gUSa6dJvIU
— സഖാവ് సంతొష్ (@vskpsakhavu) July 10, 2023
#JawanPrevue and #BhagavanthKesari Teaser Last Shot 😍😍😍#JawanPrevueOn10July #Jawan #NandamuriBalakrishna #ShahRukhKhan pic.twitter.com/lLAAaW9dpW
— സഖാവ് సంతొష్ (@vskpsakhavu) July 10, 2023