‘సారె’ తూగగలరా… ఎవరైనా!?.

50 రకాల స్వీట్లు,
250 కిలోల కిరాణా,
200 ఆవకాయ జాడీలు,
10 మేకపోతులు,
50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు,
250కిలోల బొమ్మిడాయిలు … హోటల్ మెనూ కాదు!                        అమ్మాయి తండ్రి వియ్యంకుడికి పంపిన ‘సారె’ ఇది.     Nonveg Foods min గోదావరి నది మహారాష్ట్రలో పుడితే మర్యాదలు గోదావరి జిల్లాల్లో పుట్టాయన్న సామెత . అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపేటప్పుడు కానుకలు ఇస్తుంటారు. వారి స్థోమతను బట్టి స్వీట్లు, ఇంటి సామగ్రి తదితర వస్తువులు పంపిస్తారు. కానీ రాజమహేంద్రవరానికి చెందిన ఓ  వధువు తండ్రి ఇప్పటి వరకూ ఎవరూ వినని, చూడని సారె పంపారు. ఆషాఢం మాసం రావడంతో వియ్యంకుడి రామకృష్ణ  పంపిన ఆషాఢం సారె అందరినీ ఆనందాశ్చర్యాలకు గురిచేసిందనడంలో అతిశయోక్తి లేదు.

యానాంకు చెందిన షోరూం యజమాని తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారవేత్త బత్తిన రామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి వివాహం జరిగింది. ఆషాడ మాసం కావ‌డంతో కొత్త‌గా పెళ్లైన అమ్మాయి ఇంటి నుండి అత్త‌వారింటికి సారె పంపించ‌డం గోదావ‌రి జిల్లాల్లో ఆన‌వాయితీ. ఈకోవ‌లో రాజ‌మండ్రి నుండి యానాంకు భారీ సారె పంపించారు అమ్మాయి తల్లిదండ్రులు.

ఇంకెన్నో ఆడ‌పిల్ల‌కు పెట్టాల్సినవ‌న్ని పంపించారు. యానాంలో జ‌రిగిన సారె హ‌డావుడి చూసి ఆశ్చ‌ర్య‌పోయారు స్థానికులు. తోట రాజు వీటిని గ్రామంలో తెలిసిన వారందరికీ పంచారు. పెట్టిపోతలైనా, మర్యాదలైనా గోదారోళ్ల తర్వాతేనని మరోసారి రుజువైందని అందరూ చర్చించుకుంటున్నారు.