రఘురామ కృష్ణరాజుతో పాటు రెండు ఛానల్స్ పై కోసులు

cid case

అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘురామ కృష్ణరాజు ఎఫ్ ఐ ఆర్ లో  ఏపీ సీఐడీపలు విషయాలు ప్రస్తావించించింది. ఎఫ్ ఐ ఆర్ లో సీఐడీ మొత్తం ముగ్గురు నిందితులను చేర్చింది. రఘురామ కృష్ణరాజుతో  పాటు  ప్రముఖ న్యూస్ ఛానల్స్ టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్స్ ను ఈ కేసులో సీబీఐ నిందితులుగా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5, ఏబీఎన్ చానల్లపై సీబీఐ సుమోటోగా కేసు నమోదు చేసింది. టీవీ5 మరియు ఏబీఎన్ చానల్స్  ద్వారా  రఘురామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని సీబీఐ అభియోగాల్లో పేర్కొంది. టీవీ5 ఛానల్ లో వచ్చిన రఘురామ కృష్ణరాజు డిబేట్ పై సీబీఐ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారట.

cid case

ఈమేరకు సుమోటోగా కేసు నమోదు చేసి రఘురామ కృష్ణరాజు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఉద్దేశపూర్వకంగానే ఎంపీ రఘురామ కృష్ణరాజు కు టీవీ5 ఛానల్ ప్రతినిత్యం ప్రత్యేక సమయాన్ని కెటాయించిందని సీఐడీ అభియోగాల్లో ఆరోపించింది. రఘురామ కృష్ణరాజుతో కలిసి టీవీ5 యాజమాన్యం ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసిందని, టీవీ 5 ఛానల్ పెద్దలతో ప్రతి రోజు రఘురామ కృష్ణరాజు సమావేశమై కుట్ర చేశరాని పేర్కొంది. ఈ క్రమంలోనే సీఐడీ ఎఫ్ ఐ ఆర్ లో రఘురామ కృష్ణరాజు ఏ1 గా, టీవీ5 ఏ2గా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏ3గా కేసు నమోదు చేశారు. ఒకటి రెండు రోజుల్లో టీవీ5 తో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ కు సీఐడీ నోటీసులు ఇవ్వనుందని సమాచారం.