కరోనా గతంలోనే గుర్తించి ‘ట్వీటి’న మహానుభావుడు!

‘కరోనా వైరస్… ఇట్స్ కమింగ్’ అంటూ ఏడేళ్ల క్రితం మార్క్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ గురించి 2013లోనే అతడు ఎలా చెప్పగలిగాడనే చర్చ జరుగుతోంది. 2013 జూన్ 3న మార్క్ అనే వ్యక్తి త‌న ట్విట‌ర్ ఖాతాలో ‘క‌రోనా వైర‌స్.. ఇట్స్ క‌మింగ్’ అంటూ చేసిన పోస్ట్‌ అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ల‌క్ష‌ల మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. ఎన్నో కోట్ల మందిని కోవిడ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక క‌రోనా వైర‌స్ చైనాలోని వూహాన్ సిటీకి ద‌గ్గ‌ర్లో ఉన్న ల్యాబ్‌లో నుంచి లీకైంద‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. కానీ చైనా ఆ విష‌యాల‌ను ఖండిస్తూ వ‌స్తోంది. అయితే క‌రోనా వైర‌స్ ఇప్పుడు వ‌స్తుంద‌ని 8 ఏళ్ల కింద‌టే ఓ వ్య‌క్తి ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. వైర‌ల్ అవుతున్న ఈ ట్విట్ సోష‌ల్ మీడియాతో పాటుగా ప్రపంచ దేశాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది.

img 2528

‘కరోనావైరస్’ అనే పదం క్షీరదాలు, పక్షులలో వ్యాధులకు కారణమయ్యే RNA వైరస్ సమూహాన్ని సూచిస్తుందని తెలిసిందే. అయితే అసలు కరోనా అనే పదం ప్రపంచానికి పరిచయమైందే 2019లో. అలాంటిది 2013లోనే ఈ పేరుతో వైరస్ వస్తుందని ఎలా చెప్పగలిగాడంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అత‌ను ఏదో హ్యాక్ చేసి ఉంటాడ‌ని, క‌నుక‌నే పాత తేదీతో ట్వీట్ పోస్ట్ అయ్యింద‌ని కొంద‌రు నెటిజ‌న్లు అంటున్నారు. నిజానికి ట్విట్ట‌ర్‌తో పాత డేట్‌తో ట్వీట్ చేయ‌డం కుద‌రదు. ఎందులో అయినా స‌రే ఆ అవ‌కాశం ఉండ‌దు. క‌నుక అది హ్యాక్ కాద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా స్ప‌ష్టత రాలేదు