తల్లిదండ్రులు పిల్లలను కనీ, పెంచిపెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇదే రీతిలో ఓ తల్లిదండ్రులు తమ కూతురుకే జీతం ఇచ్చి తన బాధలను తీర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు పిల్లలను కనీ, పెంచిపెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇదే రీతిలో ఓ తల్లిదండ్రులు తమ కూతురుకే జీతం ఇచ్చి తన బాధలను తీర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
తమ కూతుర్లు, కొడుకులు బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించి జీవితంలో తమకు అండగా ఉంటారని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఇక్కడ కథ వేరెలా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడికి గురవుతున్న కూతురుకి ఆ ఉద్యోగం వదిలేయమని చెప్పి, తామే నెల నెల జీతం ఇస్తామని ఆమె పేరెంట్స్ చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. చైనాలో నియానన్ అనే మహిళ కోన్నేండ్ల పాటు ఓ న్యూస్ ఏజెన్సీలో ఉద్యోగం చేసేది. ఉద్యోగ విధుల్లో ఆమె చూపిన ప్రతిభకు ప్రమోషన్ కూడా లభించింది. కానీ ఆమె విధి నిర్వహణలో చాలా ఒత్తిడికి గురయ్యేది. మానసికంగా చాలా కృంగిపోయేది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెకు ఓ సర్ ప్రైజ్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని, తమ బాగోగులు చూసుకుంటే తాము పొందుతున్న పెన్షన్ లోని కొంత మొత్తాన్ని ఇస్తామని చెప్పారు.
దీనికి కూతురు ఒప్పుకుంది. తల్లిదండ్రులతో గడిపేందుకు రెడీ అయ్యింది. అయితే దీనిని ఓ పనిలాగే భావిస్తానని, వారు ఇచ్చే డబ్బును జీతంగానే తీసుకుంటానని వెల్లడించింది. ఇక అప్పట్నుంచి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ సంతోషంగా జీవితాన్ని గడపసాగింది. తల్లిదండ్రులకు వంట చేసి పెట్టడం, బయటికి తీసుకెళ్లడం, వారితో కబుర్లు చెప్పుకోవడమే ఆమె చేసే పనులు. అయితే నియానన్ పేరెంట్స్ కి నెలకు లక్ష యువాన్ల వరకు పెన్షన్ వస్తుంది. అంటే దాదాపు 11లక్షల పైమాటే. అందులోంచి 4వేల యువాన్ల వరకు కూతురుకు జీతంగా ఇస్తున్నారు. తను ఈ జాబ్ లో ఎంతకాలం కొనసాగుతే అంతకాలం వరకు జీతం చెల్లిస్తామని, ఆ తరువాత కూడా తనకు మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ విషయం తెలిసిన కొంత మంది ఇది ఉద్యోగం ఎలా అవుతుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడడమే కదా! తల్లిదండ్రులకు సేవ చేయాలే తప్పా, దానికి ప్రతిఫలంగా డబ్బు తీసుకోకూడదని హితభోద చేస్తున్నారు.