అరె ఏంట్రా ఇదీ!..షణ్ముఖ్ జస్వంత్ ని బిగ్‌బాస్ నుంచి తప్పించారా!?..

బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లోగో విడుదల చేసిన స్టార్ మా మరోసారి కింగ్ నాగార్జునతో ప్రోమో షూటింగ్  పూర్తిచేసినట్లు తెలుస్తుంది.  కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మూడు నాలుగు రోజులు క్రితం ఐదో సీజన్ లోగోను స్టార్ మా వదిలింది. అప్పటి నుంచి లీకువీరులు రెచ్చిపోతోన్నారు.  మరికొద్దిరోజుల్లో లైవ్‌లోకి ప్రోగ్రామ్ వస్తుంది అని భావించిన సమయంలో రెమ్యూనరేషన్ డిఫరెన్స్ కారణంగా బిగ్‌బాస్ అవకాశం షణ్ముఖ్ జస్వంత్ నుంచి చేజారిపోయింది. ఈ విషయం ఇంకా అధికారకంగా తెలియాల్సి ఉంది.

imgpsh fullsize anim 5 14షణ్ముఖ్ జస్వంత్ – ఈ పేరు చాలా మందికే పరిచయం.   యూట్యూబ్‌  రెగ్యులర్ చూస్తుంటే షణ్ముఖ్ ఎవరు తెలుస్తుంది. ఇతనో సోషల్ మీడియా స్టార్. షణ్ముక్ జస్వంత్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలతో చాలా  ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా తీస్తున్నాడు.  సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందింది. దాదాపుగా రూ. కోటి తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చినా  చివరకు షణ్ముఖ్ జస్వంత్‌ను స్టార్ మా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఒక్క కంటెస్టెంట్‌కు అంత ఇస్తే వర్క్ఔట్ కాదని, ఈమేరకు స్టార్ మా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

imgpsh fullsize anim 6 14ఇక లోబో, యాంకర్‌ ప్రత్యూష, హీరోయిన్‌ ఈషా చావ్లా, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, యాంకర్‌ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, పూనం భాజ్వా, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, జబర్దస్త్‌ ప్రియాంక, యానీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, యాంకర్‌ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల(సెప్టెంబర్) 5వ తేదీ నుంచి ఈ ప్రోగ్రామ్ లైవ్‌లోకి రానుంది.