పవర్ స్టార్ కూతురు ఆద్య ఎంట్రీ…ఎక్కడా ఎలా!?.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు బుల్లితెర‌పై క‌నిపించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. త‌ల్లి రేణూ దేశాయ్ జ‌డ్జిగా చేస్తున్న ఓ టీవీ షోలో స‌డెన్‌గా ఆద్య ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆద్య‌ను చూసి రేణూదేశాయ్ చాలా ఎమోష‌న‌ల్ అయింది. తాజాగా విడుద‌లైన ఈ టీవీ షో టీజ‌ర్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంలో ఆద్య సందడి కనిపించబోతోంది. మదర్స్ డే స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఆద్యకు యాంకర్ రవి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పగా కూతురు అలా ఎంట్రీ ఇవ్వడం చూసి జడ్జి సీటు నుంచి లేచి వచ్చి ఆద్యకు స్వీట్ హగ్ ఇచ్చింది రేణూ దేశాయ్. నా బెస్ట్ డాటర్ అని ఆద్యను పొగిడేసింది. ఆద్య కూడా బెస్ట్ మదర్ అంటూ రేణుపై ప్రేమ కురిపించింది.

PK

పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ కు ఫ్యాన్ ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతని పుట్టినరోజున కూడా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతుంటాయి. ఈ మధ్యే జరిగిన నిహారిక పెళ్లికి కూడా పిల్లలిద్దరూ హాజరయ్యారు. తండ్రితో పాటు అక్కడే ఉన్నారు. ఎప్పుడు సమయం దొరికినా కూడా వెంటనే తండ్రి దగ్గరికి వచ్చేస్తుంటారు అకీరా, ఆద్య. వాళ్లకు కేరాఫ్ పవన్ కళ్యాణ్ అనేదే పెద్ద బ్రాండ్. అందుకే అకీరా, ఆద్య ఎక్కడ కనిపించినా కూడా కెమెరా కళ్లు మొత్తం వాళ్లపైనే ఉంటాయి. పైగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు ఈ పిల్లలు. ఈ క్రమంలోనే తాజాగా ఆద్య బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. రేణు దేశాయ్‌తో పాటు సింగర్ సునీత, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ మే 9న ప్రసారం కానుంది.