కంగనాకు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్!..

గతవారం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన ట్విటర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల అనంతరం ఆమె చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కించపర్చేలా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ ఆమె పలు విద్వేషపూరిత పోస్టులు చేయడంతో ట్విటర్‌ నియమ, నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఆ సోషల్‌ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ షాక్ నుంచి కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ బ‌య‌ట ప‌డ‌క ముందే, మ‌రో ప్ర‌ధాన సోష‌ల్ మీడియా మాధ్య‌మ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివ‌రాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను క‌రోనా బారిన ప‌డ్డానంటూ కంగ‌న పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Kangana Ranaut 1200 1

కంగ‌న త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తుందంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్, ఈమె పోస్ట్ చేసిన పోస్ట్‌ను తొల‌గించింది. ఈ సందర్భంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ తీరును ఎండగడుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కరోనాను అంతం చేద్దామని నేను చేసిన పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలిగించింది. ఎందుకంటే ఈ పోస్ట్ వలన ఉగ్రవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు కేవలం ట్విట్టర్‌లోనే ఉన్నారనుకున్నాను. ఇపుడే అర్ధమైంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి వారున్నారంటూ తన ఆవేదనను వెళ్ళగక్కింది.