బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది నటీమణులు తమ అందంతో పాటు అంతకంటే అందమైన తమ నటనతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అలా అభిమానాన్ని పొందిన ఎంతో మంది బాలీవుడ్ నటీమణుల్లో ఒకరు రాణి ముఖర్జీ.
బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది నటీమణులు తమ అందంతో పాటు అంతకంటే అందమైన తమ నటనతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అలా అభిమానాన్ని పొందిన ఎంతో మంది బాలీవుడ్ నటీమణుల్లో ఒకరు రాణి ముఖర్జీ. 1990 వ దశకంలో కుర్రకారు గుండెల్లో ప్రేమ అలజడిని రేపి నేటికీ సినిమాలు వెబ్ సిరీస్ లు లాంటివి చేస్తూ ఉంది. రాణీముఖర్జీ తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో తన జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందని తన లైఫ్ లాంగ్ ఆ విషయం మర్చిపోలేనని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
1996 వ సంవత్సరం లో అమీర్ ఖాన్ తో చేసిన గులాం అనే మూవీతో రాణీముఖర్జీ చాలా మంది అభిమానుల్ని సంపాందించుకుంది. ఆ తర్వాత రాణీముఖర్జీ మంచి నటీమణి అని ప్రేక్షకులందరూ ముక్తకంటంతో చెప్పేలా ఎన్నో మంచి సినిమాల్లో నటించింది. అలాగే ఆయా సినిమాల్లో తను ప్రదర్శించిన నటనకి గాను ఎన్నో అవార్డులని కూడా అందుకుంది.. కుచ్ కుచ్ హోతా హై మూవీ లో రాణీజీ పోషించిన టినా మల్హోత్రా పాత్రని ఐతే నేటికీ చాలా మంది మర్చిపోరు. ఆ పాత్రకి సంబంధించి ఫిలిం ఫేర్ అవార్డుని కూడా అందుకుంది. ఇక రాణీముఖర్జీ తాజాగా ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ లో జరుగుతున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలోనే ఆమె తన లైఫ్ లో జరిగిన భయంకరమైన సంఘటనని చెప్పుకొచ్చింది. ప్రపంచం మొత్తం ఒకేసారి విలవిలలాడిపోయిన కాలం ఏదైనా ఉంది అంటే అది కరోనా కాలమే.
ఈ కరోనా కాలంలోనే ప్రెగ్నెంట్ గా ఉన్న రాణీముఖర్జీ తన 5వ నెలకే కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకుంది. ఈ విషయాన్ని రాణీ ముఖర్జే స్వయంగ చెప్పింది. అప్పటికే ఒక బిడ్డకి తల్లిని అయిన నేను రెండో సారి బిడ్డని పోగొట్టుకునే సరికి చాలా బాధపడ్డాను. అసలు మాములు మనిషిని అవ్వడానికి చాల టైం పట్టిందని చెప్పింది. ఈ విషయం గురించి ఎప్పుడో బయటకి చెప్పేదానిని కాకపోతే ఇలాంటి విషయాలు చెప్తే సినిమా పబ్లిసిటీ కోసం మాట్లాడుతుందని అంటారని అందుకే ఎప్పుడు పర్సనల్ విషయాలు బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడనని అంది. రాణీముఖర్జి ప్రధాన పాత్రలో మిస్సెస్ ఛటర్జీ వెర్సెస్ నార్వే అనే సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆ సినిమా రూపుదిద్దుకుంది.